కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి పై సీఎం రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు

-

కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి పై సీఎం రేవంత్ రెడ్డి సెన్షేషనల్ కామెంట్స్ చేశారు. వనపర్తిలో నిర్వహించిన బహిరంగ సభలో ఆయన మాట్లాడారు. ఏడాదిలో రెండు కోట్లు ఇస్తామన్న మోడీ తెలంగాణకు రెండే ఉద్యోగాలు ఇచ్చారు. కేంద్ర మంత్రులుగా కిషన్ రెడ్డి, బండి సంజయ్ లకు మాత్రమే ఉద్యోగాలు ఇచ్చారు. చావుకు తెగించే ధైర్యం మాకుంది.. ఎవ్వరికీ భయపడేది లేదు. వరంగల్ ఎయిర్ పోర్టును మోడీ ఇచ్చిండు.. కిషన్ రెడ్డి తెచ్చిండు. మూసీ ప్రక్షాళన ఆపింది కిషన్ రెడ్డి అన్నారు.

రీజనల్ రింగ్ రోడ్డు ఆపింది. కాళేశ్వరానికి నీటి కేటాయింపులు, సమ్మక్క-సారలమ్మ, సీతారామ ప్రాజెక్టు నీటి కేటాయింపులు ఆపింది నువ్వు కాదా..? కిషన్ రెడ్డి. చేపల పులుసు తిని రాయలసీమను నీళ్లు వదిలారు. కష్టపడి నేను చేసిన పనిని కిషన్ రెడ్డి తన ఖాతాలో వేసుకుంటున్నారు. తెలంగాణకు రావాల్సిన ప్రాజెక్టులు, నిధులు ఎందుకు ఆగాయి అని ప్రశ్నించారు. బీమా, నెట్టెంపాడు, కోయిల్ సాగర్ ఎక్కడికి పోయిందని ప్రశ్నించారు.

Read more RELATED
Recommended to you

Latest news