టెక్నాలజీకి అనుగుణంగా మహిళలు శిక్షణ పొందాలి : మంత్రి నాదెండ్ల మనోహర్

-

అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్  ఏలూరులో CRR కాలేజీలో ఏర్పాటు చేసిన మహిళా దినోత్సవ వేడుకల్లో పాల్గొన్నారు. ఈ క్రమంలో మంత్రి నాదెండ్ల మనోహర్ జ్యోతి ప్రజ్వలన చేసి మహిళా దినోత్సవ వేడుకలు ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో భాగంగా రూ.131.82 కోట్ల చెక్కును మంత్రి డ్వాక్రా సంఘాల మహిళలకు అందజేశారు. అనంతరం డ్వాక్రా సంఘాల మహిళలు ఏర్పాటు చేసిన స్టాళ్లను మంత్రి పరిశీలించారు.

ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. ప్రజెంట్ పెరుగుతున్న టెక్నాలజీ  దృష్ట్యా మహిళలు అన్ని రంగాల్లో శిక్షణ పొందాలని తెలిపారు. ఈ క్రమంలో మహిళల ఆర్ధికాభివృద్ధి, భద్రతకు ఎన్డీయే కూటమి ప్రభుత్వం  అధిక ప్రాధాన్యత ఇస్తుంది అన్నారు. అలాగే మహిళలు అత్యవసర పరిస్థితిలో 181 టోల్ ఫ్రీ’ సేవలు వినియోగించుకోవాలని సూచించారు. ‘మహిళల భద్రతకు సంబంధించి శాంతి భద్రతల విషయంలో రాజీ పడేది లేదని.. మీ వెంటే మేముంటాం’ అని మంత్రి నాదెండ్ల భరోసా ఇచ్చారు.

Read more RELATED
Recommended to you

Latest news