అమరావతి (జంగారెడ్డిగూడెం): తన ఇష్టదైవం ఆంజనేయ స్వామి అని, మద్ది ఆంజనేయున్ని దర్శించుకోవడం చాలా సంతోషంగా ఉందని జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ చెప్పారు. ఆంజనేయస్వామి తమ కుటుంబానికి ఇలవేల్పు అని అన్నారు. ప్రజాపోరాట యాత్రలో భాగంగా పశ్చిమగోదావరి జిల్లా జంగారెడ్డిగూడెంలో బస చేసిన పవన్ కల్యాణ్ మంగళవారం ఉదయం గుర్వాయగూడెంలోని మద్ది ఆంజనేయ స్వామి ఆలయాన్ని దర్శించారు. ఆలయ అధికారులు ఆయనకు ఘనస్వాగతం పలికారు. పండితులు వేద ఆశీర్వచనం అందచేశారు. ఆంజనేయుడికి పూజలు చేసిన అనంతరం పవన్ తిరిగి యాత్రకు వెళ్లిపోయారు.
మద్ది ఆంజనేయుడ్ని దర్శించుకున్న పవన్ కళ్యాణ్
-