టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడిపై వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి విమర్శలు గుప్పించిన సంగతి తెలిసిందే. ‘దమ్ముంటే అసెంబ్లీని రద్దు చేయండి.. రాజీనామా చేసి మళ్లీ గెలిస్తే కౌన్సిల్ రద్దును సమర్థిస్తామని రంకెలు వేసే బదులు మీరంతా రిజైన్ చేసి గెలవండి. రిఫరెండంగా భావిస్తాం. నోరు తెరిస్తే దమ్ము, సత్తాల గురించి మాట్లాడటం తప్ప వాటిని ప్రదర్శించే సాహసం మాత్రం చేయడు. ఇంకా 1990ల్లోనే ఉంటే ఎలా బాబూ!’ అని విజయసాయిరెడ్డి విమర్శలు గుప్పించారు. అయితే విజయసాయిరెడ్డి చేసిన విమర్శలకు టీడీపీ నేత బుద్ధా వెంకన్న కౌంటర్ ఇచ్చారు. ‘విజయసాయిరెడ్డి గారు.. మీరు, మీ జగన్ గారు 2020లో ఉన్నారు కదా మీ దమ్ము, సత్తా సీబీఐ, ఈడీ ముందు చూపించండి.
అప్పుడు ఎవరు ఏ కాలంలో ఉన్నారో తేలిపోతుంది. మొన్నటి వరకూ 151 అని కాలర్ ఎగరేశావ్. ఇప్పుడు గేట్లు ఎత్తమంటారా? అనే స్థితికి వచ్చారు’ అని ట్వీట్ చేశారు. ‘బిల్లు సెలెక్ట్ కమిటీకి వెళ్తే తడుపుకొని మండలి రద్దు చేసిన మీరా దమ్ము, ధైర్యం గురించి మాట్లాడేది? 151 మంది ఉన్నాం అని చెప్పి ఇద్దరు టీడీపీ ఎమ్మెల్యేలను సంతలో గొర్రెల్లా కొన్నప్పుడే మీ వాడికి సీన్ లేదు అని అర్థం అయ్యింది’ అని బుద్ధా వెంకన్న అన్నారు.