మేము టెర్రరిస్టులం కాదు.. జంట ఆత్మహత్యలపై ఆరెక్స్ హీరో రెస్పాన్స్

-

జగిత్యాల జంట ఆత్మహత్యల విచారణలో ఆరెక్స్ 100 సినిమానే వారి ఆత్మహత్యకు కారణమని పోలీసులు చెప్పారని కొన్ని మీడియా ఛానెల్స్ వార్తలు ప్రకటిస్తున్నాయి. దీనిపై ఆరెక్స్ 100 సినిమా హీరో కార్తికేయ స్పందించారు. తాము కేవలం ఆర్టిస్టులమే కాని మనుషుల ప్రాణాలు తీసే టెర్రరిస్టులం కాదని ఆ ఆత్మహత్యలకు తమ సినిమాకు ఎలాంటి సంబంధం లేదని వీడియో ద్వారా స్పందించాడు కార్తికేయ.

సినిమాలో ఆత్మహత్య చేసుకోమని ఎక్కడ ఎవరు చెప్పలేదని.. హీరోయినే హీరోని చంపాలని అనుకుంటుందని. సినిమాను సినిమాగానే చూడాలి తప్ప ఇలా చేయకూడదని.. ఆరెక్స్ 100 లోని పిల్లా రా సాంగ్ తెలుగు రెండు రాష్ట్రాల్లో ప్రజలకు బాగా నచ్చిందని. ఆపాట ఇష్టం అని చెప్పిన వ్యక్తి మరణానికి ఆరెక్స్ 100 సినిమా కారణమని అనడం కరెక్ట్ కాదని అన్నాడు కార్తికేయ.

ఇక మీదట ఇలాంటివి జరుగకుండా పెద్దలు పిల్లలను మోటివేట్ చేయాలని అన్నాడు. ఆర్టిస్టులు, డైరక్టర్లు సినిమాలు మాత్రమే చేస్తారు. మనుషులు ప్రాణాలు చేసే టెర్రరిస్టులు కాదని చెప్పాడు కార్తికేయ.

Read more RELATED
Recommended to you

Latest news