విజయ్ కెరియర్ హయ్యెస్ట్ బిజినెస్..!

-

విజయ్ దేవరకొండ హీరోగా ఈ శుక్రవారం ప్రేక్షకుల ముందుకు వస్తున్న సినిమా నోటా. ఆనంద్ శంకర్ డైరక్షన్ లో వస్తున్న ఈ సినిమాను స్టూడియో గ్రీన్ బ్యానర్ లో జ్ఞానవెల్ రాజా నిర్మిస్తున్నారు. పొలిటికల్ థ్రిల్లర్ గా రాబోతున్న నోటా సినిమా ప్రీ రిలీజ్ బిజినెస్ డీటైల్స్ రివీల్ అయ్యాయి. తెలుగు, తమిళ భాషల్లో రిలీజ్ అవుతున్న ఈ సినిమా కేవలం తెలుగు వర్షనే పాతిక కోట్ల దాకా బిజినెస్ చేసిందని తెలుస్తుంది.

తెలుగు రెండు రాష్ట్రాల్లో 19 కోట్ల బిజినెస్ చేయగా.. ఓవర్సీస్ లో 3.5 కోట్లు.. కర్ణాటక, తమిళనాడు తెలుగు వర్షన్, రెస్ట్ ఆఫ్ ఇండియా మొత్తం కలిపి మరో రెండ్డున్నర కోట్లు బిజినెస్ చేసిందట. ఈ లెక్క ప్రకారం చూస్తే నోటా తెలుగు వర్షన్ 25 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ చేసిందని లెక్క తేలింది.

సినిమాలో విజయ్ సిఎంగా కనిపిస్తాడని ట్రైలర్ చూస్తే అర్ధమవుతుంది. హీరోయిన్ గా మెహ్రీన్ కౌర్ నటించిన ఈ సినిమా బిజినెస్ అదరగొడుతుండగా ఫలితం ఎలా ఉండబోతుందో చూడాలి. గీతా గోవిందం సినిమా 100 కోట్ల గ్రాస్ కలెక్ట్ చేయగా ఈ సినిమా అంతకుమించి వసూళ్లను రాబడుతుందో లేదో చూడాలి.

Read more RELATED
Recommended to you

Latest news