సరిలేరు ఓకే, మరి అల పరిస్థితి ఏంటో…..??

-

టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా తెరకెక్కిన తాజా సినిమా సరిలేరు నీకెవ్వరు మొన్న సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు వచ్చి మంచి కలెక్షన్ రాబట్టడం జరిగింది. మహేష్ సరసన రష్మిక మందన్న హీరోయిన్ గా నటించిన ఈ సినిమాలో విజయశాంతి ఒక కీలక పాత్రలో నటించగా ప్రకాష్ రాజ్ విలన్ గా నటించాడు. ఇకపోతే దీనితో పాటే స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ నటించిన అలవైకుంఠపురములో సినిమా కూడా రిలీజ్ అయి మంచి సక్సెస్ ని సాధించింది. బన్నీ సరసన పూజ హెగ్డే హీరోయిన్ గా నటించిన ఈ సినిమాలో సీనియర్ నటి టబు ఒక కీలక పాత్రలో నటించగా తమిళ నటుడు సముద్ర ఖని విలన్ గా నటించారు. ఇక ఈ రెండు సినిమాలు కూడా ఒకదానితో మరొకటి పోటీపడి మంచి కలెక్షన్స్ సాధించాయి. నిజానికి సంక్రాంతి సీజన్ తో వరుసగా సెలవలు రావడంతో ఈ రెండు సినిమాలకు బాగా కలిసి వచ్చింది. మంచి కమర్షియల్ ఎంటర్టైనర్ గా సరిలేరు తెరకెక్కితే,

Allu Arjun and Mahesh Babu

మంచి ఫ్యామిలీ ఎమోషనల్ ఎంటర్టైనర్ గా అలవైకుంఠపురములో తెరకెక్కింది. ఇక ఈ రెండు సినిమాలు కూడా చాలా చోట్ల బ్రేక్ ఈవెన్ ని దాటేసి పలు డిస్ట్రిబ్యూటర్లకు లాభాలు అందించాయి. అయితే కొందరు ట్రేడ్ విశ్లేషకుల నుండి అందుతున్న సమాచారాన్ని బట్టి మన రెండు తెలుగు రాష్ట్రాల్లో సరిలేరు బాగా రాబడితే, ఓవర్సీస్ లో అల సినిమా బాగా కలెక్షన్ చేజిక్కించుకుందని అంటున్నారు. ఇకపోతే ఈ రెండు సినిమాల డిజిటల్ హక్కుల విషయం లో కూడా భారీగానే బిజినెస్ జరిగినట్లు చెప్తున్నారు. ఇక మహేష్ సరిలేరు సినిమాని అమెజాన్ ప్రైమ్ అత్యధిక ధరకు దక్కించుకుందని, అలానే ఈ సినిమాని మార్చి మొదటివారంలో ప్రైమ్ లో ప్రసారం చేసే ఛాన్స్ ఉందని అంటున్నారు.

 

అయితే అల విషయమై మాత్రం పూర్తి న్యూస్ బయటకు రావడం లేదు. నిజానికి ఈ సినిమా విడుదల టైం లో తమ సినిమాని అమెజాన్, నెట్ ఫ్లిక్స్ వంటి వాటిలో చూడలేరని అల సినిమా యూనిట్ తమ పోస్టర్లలో ప్రకటించింది. అటువంటప్పుడు ఈ సినిమా డిజిటల్ హక్కులు అసలు అమ్మరా లేదా అనేది అర్ధం కావడం లేదు. మరోవైపు ప్రస్తుత ఓటిటి ప్లాట్ ఫామ్స్ కి పోటీగా ఇటీవల అల్లుఅరవింద్ నెలకొల్పిన ఆహా డిజిటల్ ప్లాట్ ఫామ్ లో దానిని ప్రసారం చేస్తారనే ప్రచారం కూడా జరుగుతోంది. మరి సరిలేరు విషయంలో దీనిపై క్లారిటీ ఉన్నప్పటికీ, అల విషయమై మాత్రం క్లారిటీ పూర్తిగా లేదనే చెప్పాలి. ఏది ఏమైనా ఈ విషయంలో అల మూవీ టీమ్ స్పందిస్తేనే కానీ పూర్తి వివరాలు తెలియవు……!!

Read more RELATED
Recommended to you

Latest news