జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ ప్రశ్నిస్తాను అని చెప్పి రాజకీయాల్లోకి ఎంట్రీ ఇవ్వటం జరిగింది. 2014 ఎన్నికల్లో పార్టీని స్థాపించిన పవన్ కళ్యాణ్ ఆ సమయంలో తెలుగుదేశం బి.జె.పి కూటమికి మద్దతు తెలిపిన చంద్రబాబు ముఖ్యమంత్రి అవ్వటానికి కారణం అవ్వడం జరిగింది. అయితే ఆ సమయంలో జరిగిన ఎన్నికల ప్రచారంలో చంద్రబాబు తప్పు చేస్తే కచ్చితంగా కాలర్ పట్టుకుని ప్రశ్నిస్తాం అని పవన్ మాట ఇవ్వడం జరిగింది. తీరా చంద్రబాబు హయాంలో తీవ్రమైన అవినీతి ఆరోపణలు వచ్చినా గానీ పవన్ కళ్యాణ్ కరెక్ట్ గా ప్రకటించిన దాఖలాలు లేవు.
పైగా ఆ సమయంలో ముందు నుండి జగన్ పార్టీని ప్రశ్నిస్తూ వైసీపీని టార్గెట్గా పెట్టుకున్నారు. 2019 ఎన్నికల్లో టిడిపికి బిజెపికి గుడ్ బై చెప్పిన పవన్ కళ్యాణ్ ఒంటరిగా పోటీ చేసి దారుణంగా ఓటమి పాలవడం జరిగింది. ఇటువంటి నేపథ్యంలో పవన్ ఒక పక్క సినిమాలు చేస్తూ మరో పక్క మళ్లీ బీజేపీ పార్టీ తో చేతులు కలపడంతో పార్టీకి జేడీ లక్ష్మీనారాయణ రాజీనామా చేయడం జరిగింది.
ఇదే సందర్భంలో జనసేన పార్టీకి మాజీ మంత్రి పసుపులేటి బాలరాజు ఇంకా కొంతమంది నాయకులు కూడా జనసేన కు గుడ్ బై కొట్టేసారు. చాలామంది జనసేన పార్టీ నాయకులు పార్టీని వీడినా గాని ఎక్కువగా జేడీ లక్ష్మీనారాయణ మరియు పసుపులేటి బాలరాజు పార్టీని వీడటం పవన్ కళ్యాణ్ కి చావు దెబ్బ కొట్టినట్లయింది అని అంటున్నారు రాజకీయ విశ్లేషకులు. ఇందువల్లనే విశాఖ నియోజకవర్గానికి చెందిన నాయకుల దెబ్బ వల్ల తాజాగా రాబోయే ఎన్నికలలో తాడేపల్లిగూడెం నియోజకవర్గం నుండి పవన్ పోటీ చేస్తున్నట్లు మాట్లాడుతున్నారని పొలిటికల్ మేధావులు విశ్లేషించారు.