రెండు రోజులుగా పెరుగుతున్న బంగారం ధర ఈ రోజు కూడా అదే దారులో నడిచింది. హైదరాబాద్ మార్కెట్‌లో శనివారం బంగారం మళ్లీ స్వల్పంగా పెరిగింది. 22 క్యారెట్ల బంగారం 10 గ్రాములకు రూ.10 పెరుగదలతో రూ.39,810కు చేరింది. అదేసమయంలో 24 క్యారెట్ల బంగారం ధర కూడా రూ.10 పెరుగుదలతో రూ.43,430కు ఎగసింది. బంగారం ధర పెరుగుతూ రావడం ఇది వరుసగా 3వ రోజు కావడం గమనార్హం. ఈ మూడు రోజుల్లో ధర ఏకంగా రూ.790 పెరగడం గమనార్హం.
బంగారం ధర పెరిగితే వెండి ధర మాత్రం ఉన్న చోటునే ఉంది. స్థిరంగా కొనసాగింది. ధరలో ఎలాంటి మార్పు లేదు. దీంతో కేజీ వెండి ధర రూ.49,900 వద్దనే నిలకడగా ఉంది. పసిడి ధర ఎప్పుడూ పెరుగుతూనే ఉండదు. అలాగే ఎల్లప్పుడూ తగ్గుతూ కూడా రాదు. బంగారం ధర పరిస్థితులకు అనుగుణంగా తగ్గుతూ పెరుగుతూ వస్తుంది. అలాగే కొన్ని సందర్భాల్లో స్థిరంగా కూడా ఉండొచ్చు. బంగారం ధరపై ప్రభావం చూపే అంశాలు చాలానే ఉన్నాయి.