జగన్ – కే‌సి‌ఆర్ కలిసి వేసిన మాస్టర్ స్కెచ్ మామూలుగా లేదు .. పర్ఫెక్ట్  టార్గెట్ !

-

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైయస్ జగన్ తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కెసిఆర్ ఇద్దరూ పాజిటివ్ వే లో ఒకరి పట్ల ఒకరు వ్యవహరిస్తున్నారు. రెండు రాష్ట్రాలకు సంబంధించి ఎలాంటి సమస్య అయినా సామరస్య వాతావరణంలో పరిష్కరించుకునేలా పరిపాలన సాగిస్తున్నారు. గతంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా చంద్రబాబు ఉన్న సమయంలో రెండు తెలుగు రాష్ట్రాల మధ్య భిన్నమైన వాతావరణం ఉండేది. కానీ వైఎస్ జగన్ అధికారంలోకి వచ్చాక విభజనతో నష్టపోయిన ఆంధ్రప్రదేశ్ పొరుగు రాష్ట్రాలతో మంచి సంబంధాలు ఉంటేనే అభివృద్ధి లో ముందుకు వెళ్లే అవకాశం ఉంది అని చాలా పాజిటివ్ వాతావరణం లో ఇతర రాష్ట్రాలతో వ్యవహరిస్తున్నారు. Image result for jagan kcr

ఇటువంటి నేపథ్యంలో రెండు తెలుగు రాష్ట్రాలలో రాజకీయంగా జగన్ మరియు కెసిఆర్ కి ఉమ్మడి రాజకీయ శత్రువు ఎవరంటే కచ్చితంగా చంద్రబాబు అని చాలామంది ఉంటారు. చంద్రబాబుని తెలంగాణలో కనుమరుగు చేయాలనే జగన్ వైసిపి పార్టీని తెలంగాణలో వదులుకోవటం జరిగిందని చాలా మంది సీనియర్ రాజకీయ నేతలు అంటారు. అయితే ప్రస్తుతం తెలంగాణలో టీడీపీ పూర్తిగా కనుమరుగు కావడంతో…ఆంధ్రాలో కూడా అదే పరిస్థితి తీసుకు రావాలి అని జగన్ – కే‌సి‌ఆర్ కలిసి వేసిన మాస్టర్ స్కెచ్ ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాలలో పెద్ద హైలెట్ అయ్యింది.

 

విషయంలోకి వెళితే చంద్రబాబు ప్రభుత్వం లో జరిగిన అవినీతి మొత్తం బయటకు తీయాలి అని సీఎం వైఎస్ జగన్ పది మంది సభ్యులతో సిట్ బృందాన్ని ఏర్పాటు చేశారు. ఆకస్మాత్తుగా ఈ సిట్ ఏర్పాటు చేయడం వెనుక తెలంగాణ సీఎం కేసీఆర్ ఉన్నట్లు తాజాగా వార్తలు బయటకు వస్తున్నాయి. విషయంలోకి వెళితే ఇరు రాష్ట్రాలకు సంబంధించి చంద్రబాబు హయాంలో జరిగిన అవినీతికి సంబంధించి అతి పెద్ద కీలక పాయింట్ ఒకటి దొరికినట్లు ఈ పాయింట్ తో పూర్తిగా చంద్రబాబుని రాజకీయంగా ఫినిష్ చేయాలని జగన్ మరియు కేసీఆర్ అదిరిపోయే స్కెచ్ వేసినట్లు సమాచారం.

Read more RELATED
Recommended to you

Latest news