ఆ సీన్స్ చేస్తే బ్యాడ్ అయిపోతావేమో ఆలోచించుకో ..రాక రాక ఒక హిట్టొచ్చింది ..!

-

అప్పుడెప్పుడో ‘అ..ఆ’ సినిమాతో హిట్ అందుకున్నాడు యంగ్ హీరో నితిన్. త్రివిక్రం శ్రీనివాస్ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో సమంత హీరోయిన్ గా నటించింది. ఆ తర్వాత నితిన్ చేసిన సినిమాలు వరుసగా ఫ్లాపవుతూ వచ్చాయి. లై, ఛల్ మోహన రంగా దారుణంగా ఫ్లాపయ్యాయి. దాంతో కాస్త గ్యాప్ ఇచ్చిన ఈ హీరో మళ్ళీ ‘భీష్మ’ సినిమాతో హిట్ ని తన ఖాతాలో వేసుకున్నాడు. వెంకీ కుడుముల దర్శకత్వం వహించిన ఈ సినిమా విడుదలైన వారం రోజుల్లో 50 కోట్లు వసూళ్ళని రాబట్టింది. రిలీజ్ కి ముందే 10 కోట్ల టేబుల్ ప్రాఫిట్ ని దక్కించుకున్న ఈ సినిమా సక్సస్ తో మంచి జోష్ మీద ఉన్నాడు నితిన్. ఇదే ఊపుతో బాలీవుడ్ సినిమా రీమేక్‌తో ప్రయోగం చేయాబోతున్నాడు.

 

బాలీవుడ్ హీరో ఆయుష్మాన్ ఖురానా నటించిన ‘అంధాదున్’ సినిమా అక్కడ సూపర్ హిట్ ని దక్కించుకుంది. అందుకే ఈ సినిమాతో నితిన్ టాలీవుడ్ లో పెద్ద ఎక్స్‌పరిమెంట్ చేయబోతున్నాడు. ‘అంధాదున్’ లో ఆయుష్మాన్ ఖురానా, రాధికా ఆప్టే జంటగా టబు విలన్ పాత్రలో నటించారు. బాలీవుడ్ జనాలకి నచ్చే విధంగా అడల్ట్ కంటెంట్ అండ్ సెక్స్ సీన్స్ ఈ సినిమాలో మెండుగా ఉన్నాయి. హీరో హీరోయిన్స్ అతిగా రొమాన్స్ చేసిన సీన్స్ అక్కడ ప్రేక్షకులను బాగా ఆకట్టుకున్నాయి. కానీ తెలుగులో అలాంటి సీన్స్ చూడటానికి జనాలు ఎంతవరకు సిద్దంగా ఉంటారా అన్నది అనుమానమే. ముఖ్యంగా నితిన్ కి ఉన్న ఫ్యామిలీ ఆడియన్స్ ఈ సీన్స్ ని ఇష్ఠపడతారా అన్నది ఇప్పుడు టాలీవుడ్ మేకర్స్ ని డైలమాలో పడేసింది.

అందుకే ఈ సెక్స్ సీన్లకు సంబంధించి చిత్ర యూనిట్ లో కొన్ని చర్చలు జరుగుతున్నాయట. హిందీ వెర్షన్‌లో సెక్స్ సీన్లు ఉన్నప్పటికీ.. తెలుగులో అలాంటి సీన్స్.. అందులోనూ నితిన్ లాంటి హీరో ఇలాంటి సెక్స్ సీన్స్ ని చేయిస్తే ఫ్యామిలీ ఆడియన్స్ థియేటర్స్ కి రారు కాబట్టి ఈ సీన్స్ ని తీసేసి వాటి ప్లేస్ లో వేరే సీన్స్ ని పెడదామని చిత్ర యూనిట్ రచయిత, దర్శకులకి సూచించారట. దాంతో స్క్రిప్ట్ లో కొన్ని సీన్ ని మార్చేసినట్టుగా తెలుస్తోంది. అయితే నితిన్ ఫ్యాన్స్ ‘అంధాదున్’ రీమేక్ చేస్తున్నాడనగానే రాక రాక ఒక హిట్టొచ్చింది ..ఇప్పుడు ఇలాంటి ఎక్స్‌పరిమెంట్స్ అవసరమా అంటూ సలహాలిస్తున్నారట.

Read more RELATED
Recommended to you

Latest news