అచ్చం కపిల్ ను దించేశాడుగా….

-

భారత క్రికెట్ చరిత్రలో 1983 వరల్డ్ కప్ మరువలేని ఓ ఘట్టం. అప్పటి వరకూ కేవలం కొందరికి మాత్రమే తెలిసిన క్రికెట్ గేమ్ ను భారతీయుల నరనరాల్లో కి ఎక్కేలా తయారు చేసింది ఆ వరల్డ్ కప్. దారి ఖర్చులు కూడా వేస్ట్ అన్నవాళ్ళ నోళ్ళను సైతం కట్టిపడేసేలా చేసింది అప్పటి భారత క్రికెట్ టీం. ఇండియాకు తొలి వరల్డ్ కప్ అందించిన మాజీ కెప్టెన్ కపిల్ దేవ్ బయోపిక్ గా తెరకెక్కుతున్న చిత్రం  “83”.

 

 

ఈ చిత్రంలో బాలివుడ్ హీరో రణ్ వీర్ సింగ్ కపిల్ దేవ్ పాత్రలో కనిపించనున్నాడు. ఈ చిత్రానికి సంబంధించిన కొత్త పోస్టర్ ను చిత్ర యూనిట్ సోషల్ మీడియాలో ఉంచింది. కప్ అందుకున్న తర్వాత కపిల్ ముఖంలో కనిపించిన ఆనందాన్ని కళ్ళకు కట్టేలా ఈ పోస్టర్ ఉంది.

ఇప్పటికే విడుదల చేసిన పోస్టర్లు చిత్రంపై అంచనాలను పెంచేస్తున్నాయి. వచ్చే నెల 10న ఈ చిత్రం ఆడియన్స్ ముందుకు రానుంది. ఈ మూవీలోొ కపిల్ దేవ్ భార్య పాత్రలో బాలివుడ్ హీరోయిన్, రణ్ వీర్ సింగ్ భార్య దీపికా పదుకునే నటించనుంది.

Read more RELATED
Recommended to you

Latest news