మహిళల ఉపాధి కోసం కెసిఆర్ అదిరిపోయే ప్లాన్…?

-

తెలంగాణా ప్రభుత్వం ఇప్పుడు సంక్షేమ పథకాల అమలు విషయంలో దూసుకుపోతున్న సంగతి తెలిసిందే. తాజాగా మరో కార్యక్రమానికి కెసిఆర్ సర్కార్ శ్రీకార౦ చుడుతున్నట్టు తెలుస్తుంది. రాష్ట్రంలో ప్రతిభ ఉండి ఇంట్లో ఉపాధి అవకాశాలు లేని మహిళల కోసం కెసిఆర్ సర్కార్ ఇప్పుడు సరికొత్త ఆలోచన చేస్తుంది. “తెలంగాణా స్త్రీ శక్తి” అనే పేరుతో ఒక కార్యక్రమానికి తెలంగాణా సర్కార్ శ్రీకారం చుడుతుంది.

చాలా మంది పదో తరగతి, ఇంటర్, డిగ్రీ తో చదువులు ఆపేశారు. ఆర్ధిక స్తోమత లేక వివాహాలు చేసుకోవడంతో ఇప్పుడు వాళ్లకు ప్రతిభ ఉన్నా సరే సరైన అవకాశాలు లేక ఇబ్బంది పడుతున్నారు. దీనితో ఈ కార్యక్రమం ద్వారా ముందు రెవెన్యు ఉద్యోగులు లేదా ఇతర శాఖల ఉద్యోగులతో వారి జాబితాను సేకరిస్తారట. ఆ జాబితాలో ఉన్న వాళ్లలో ఆదాయం ఎక్కువగా వచ్చే రంగాల మీద ఆసక్తి ఉన్న వాళ్ళను గుర్తిస్తారు.

వారికి ముందు గ్రామాల్లో ఉపాధి కల్పించడం, అంటే డ్వాక్రా తరహాలో రుణాలను ఏర్పాటు చేసి నేరుగా అధికారులే వెళ్లి వారి వ్యాపారాలను పర్యవేక్షించి, ఏ మాత్రం వడ్డీ లేకుండా రుణాలు ఇవ్వాలని, తద్వారా ఎవరికి అయితే ఏయే రంగాల మీద ఆసక్తి ఉందో వారితో వ్యాపారాలు పెట్టించడం లేదా, ప్రభుత్వ శాఖల్లో అవసరమయ్యే చిన్న చిన్న వస్తువులను తయారు చేయించే విధంగా ప్రోత్సాహకాలు అందించడం వంటివి చేస్తారు.

అదే విధంగా మిషన్ కుట్టే మహిళలు అయితే వారికి కుట్టు మిషన్ లు ఇవ్వడం, ఈ తరహాలో కెసిఆర్ సర్కార్ ఆలోచన చేస్తుంది. త్వరలోనే దీనికి సంబంధించిన కార్యాచరణను రూపొందించే ఆలోచనలో ఉన్నారు. గ్రామాల్లో ఏయే రంగాల ద్వారా ఉపాధి కల్పించవచ్చు అనే దాని మీద ముందు కసరత్తులు చేసి ఆ తర్వాత ఆ విధంగా ముందుకి నడిపించాలని కెసిఆర్ భావిస్తున్నారట. దీనికి సంబంధించి ఇంకా పూర్తి వివరాలు తెలియలేదు.

Read more RELATED
Recommended to you

Latest news