విద్యార్ధుల కోసం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పలు కార్యక్రమాలు మొదలుపెడుతున్న సంగతి తెలిసిందే. విద్యార్ధులు అందరూ చదువుకోవాలని, ఎవరూ చదువుకి దూరం కావోద్దని భావించిన ఏపీ సిఎం వైఎస్ జగన్ వారి కోసం ప్రత్యేక కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారు. ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం వారి కోసం ఆర్ధిక సహాయం కూడా చేస్తుంది. ఈ మేరకు ముఖ్యమంత్రి అయిన తర్వాత పలు పేర్లతో వాటిని అన్ని రకాల విద్యార్ధులకు అందుబాటులోకి తీసుకొచ్చారు.
అమ్మ ఒడి, జగనన్న వసతి దీవెన, జగనన్న విద్యా కానుక,నాడు-నేడు అనే కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారు. తాజాగా పాఠశాల విద్యార్థినులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న ఉన్నత పాఠశాలల్లో శానిటరీ నాప్‌కిన్స్ వెండింగ్ మెషీన్లను ఏర్పాటు చేయాలని అధికారులకు ఆదేశాలు ఇచ్చినట్టు సమాచారం. ఈ యంత్రాల్లో ఒక రూపాయి వేస్తే ఒక నాప్‌కిన్ వచ్చేలా ఈ యంత్రాలను రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశ పెట్టింది.
పైలట్ ప్రాజెక్ట్‌గా ఎంపిక చేసిన కొన్ని ప్రభుత్వ పాఠశాలల్లో శానిటరీ నాప్‌కిన్ వెండింగ్ మెషీన్లును రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేస్తుంది. వచ్చే విద్యా సంవత్సరం నుంచి ఆయా స్కూళ్లలో ఈ యంత్రాలను ఏర్పాటు చేయబోతున్నారు అధికారులు. ఆ తర్వాత దశల వారీగా రాష్ట్రం మొత్తం అమలు చేస్తారు. హిందూస్తాన్ లివర్ కంపెనీ సహకారంతో ఈ వెండింగ్ మెషీన్లను ఏర్పాటు చేయనున్నారు.
కేంద్రం ఏర్పాటు చేసిన జనఔషధి దుకాణాల్లో శానిటరీ నాప్‌కిన్స్ ధర 4 రూపాయలుగా ఉంది. కాని జగన్ సర్కార్ మాత్రం ఒక రూపాయికే నాప్‌కిన్ అందజేయాలని నిర్ణయించింది. విద్యార్థుల కోసం ఇప్పటికే సీఎం జగన్ పలు పథకాలను అందుబాటులోకి తీసుకొచ్చారు.