ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ఆంధ్రప్రదేశ్ డీజీపీ ఆఫీస్ ముందు బైటాయించారు. మాచర్లలో టీడీపీ నేతలు బుద్దా వెంకన్న, బొండా ఉమా పై బుధవారం మధ్యాహ్నం దాడి జరిగింది. ఈ దాడిలో వారిపై హత్యాయత్నం జరిగింది అనే ఆరోపణలు వస్తున్నాయి. ఈ దాడిలో వారు తీవ్రంగా గాయపడ్డారు. లాయర్ కిషోర్ తల కూడా పగిలింది. దీనితో ఒక్కసారిగా పరిస్థితి ఉద్రిక్తంగా మారింది.
ఇప్పుడు వారిని తీసుకుని చంద్రబాబు డీజీపీ ఆఫీస్ ముందు బైఠాయించారు. డీజీపీ ఆఫీస్ ముందు రోడ్డుపై కూర్చున్నారు చంద్రబాబు. ఆయనను పోలీసులు లోపలి అనుమతి ఇవ్వకపోవడంతో చంద్రబాబు రోడ్డు మీద కూర్చున్నారు. చంద్రబాబుతో పాటుగా రోడ్డు మీద సిపిఐ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రామకృష్ణ కూర్చున్నారు. చంద్రబాబుతో పాటుగా టీడీపీ నేతలను ఎవరిని లోపలికి అనుమతించలేదు.
బుధవారం మధ్యాహ్నం వైసీపీ దాడి బాధితులను పరామర్శించడానికి టీడీపీ నేతలు వెళ్ళగా వారిపై కొందరు వైసీపీ కార్యకర్తలు దాడులకు దిగారు. విచక్షణారహితంగా దాడులకు దిగారు. ఇక అడ్డుకున్న పోలీసులపై కూడా దాడులకు దిగారు వైసీపీ కార్యకర్తలు. దీనితో ఒక్కసారిగా పరిస్థితి ఉద్రికితంగా మారింది. దీనికి సంబంధించిన వీడియో లు సోషల్ మీడియాలో వైరల్ కావడంతో అధికార పార్టీపై తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి.