అగ్రరాజ్యం లో అడుగుపెట్టాలని సరిహద్దు గోడ ఎక్కేందుకు యత్నించిన గర్భిణి… చివరికి

-

అగ్రరాజ్యం అమెరికా లో స్థిరపడాలన్నది ప్రతి ఒక్కరి కల. అయితే అమెరికా అధ్యక్షుడుగా డోనాల్డ్ ట్రంప్ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి కూడా వలసదారులపై వేటు పడుతూనే ఉంది. అమెరికా లోకి వలసదారులు అడుగుపెట్టనివ్వబోను అంటూ అధ్యక్షుడు ట్రంప్ సరిహద్దు గోడను కూడా నిర్మించారు. అయితే ఈ సరిహద్దు గోడ ఎక్కేందుకు ప్రయత్నిస్తూ ఒక గర్భవతి యువతి తన ప్రాణాలు కోల్పోయింది. అగ్రరాజ్యం అమెరికా లో కాలు పెట్టేందుకు చట్టరీత్యా అవకాశం లేకపోతె చట్టాన్ని,నిబంధలను ఉల్లంఘించైనా అమెరికా కు చేరుకొనేందుకు చాలా మంది ప్రయత్నిస్తూనే ఉన్నారు. ఈ క్రమంలోనే శనివారం టెక్సాస్ లోని ఎల్ సోపో సమీపంలో యూ ఎస్ సరిహద్దు గోడ ఎక్కేందుకు ప్రయత్నిస్తూ గ్వాటెమాలా కు చెందిన 19 ఏళ్ల గర్భవతి ప్రాణాలు కోల్పోయింది. మృతురాలిని మిరియన్ స్టెఫానీ గిరోన్ లూనాగా గుర్తించారు.ఆమె ప్రస్తుతం ఎనిమిది నెలల గర్భవతి, ఈ క్రమంలో సుమారు 19 అడుగుల గోడ ఎక్కే ప్రయత్నంలో కిందపడిపోయి తీవ్రగాయాల పాలైంది. ఆమెను గుర్తించిన అధికారులు వెంటనే ఆసుపత్రికి తరలించినప్పటికీ ప్రయోజం లేకుండా పోయింది.

తీవ్రగాయాలతో చికిత్స పొందుతూ స్టెఫానీ మరణించింది. అయితే గిరోన్‌తో పాటు ఆమె భర్తను అక్రమ రవాణా ముఠాదారులు సరిహద్దుకు తీసుకెళ్లారని, చిమ్మచీకటిలో 19 అడుగుల ఎత్తున్న గోడను ఎక్కేందుకు ప్రయత్నిస్తూ గిరోన్ కింద పడిపోయిందని సీబీపీ తాత్కాలిక కమీషనర్ మార్క్ మోర్గాన్ ఆరోపించారు. ప్రస్తుతం గిరోన్ భర్త గా భావిస్తున్న వ్యక్తిని టెక్సాస్ లోని డెల్ రియోలో బోర్డర్ పెట్రోల్ అధికారుల ఆధీనంలో ఉన్నట్లు గ్వాటెమాల కాన్సుల్ టెకాండి పానియాగువా ఫ్లోర్స్ తెలిపారు.

Read more RELATED
Recommended to you

Latest news