అమెరికా పర్యటన ముగించుకొని వెళ్లిన ఆస్ట్రేలియా హోంమంత్రి కి కరోనా… ఇవాంక పరిస్థితి ఏంటి!!

-

కరోనా పేరు వినగానే ప్రపంచదేశాలు వణికిపోతున్నాయి. కరోనా కు ధనిక,పేద అన్న తేడా లేకుండా ప్రతి ఒక్కరినీ కూడా ఈ కరోనా పలకరిస్తూనే ఉంది. అయితే తాజాగా ఆస్ట్రేలియా హోంమంత్రి పీటర్ దుట్ఠన్ కూడా కరోనా వైరస్ బారిన పడిన విషయం సంచలంగా మారింది. అయితే ఆయన అమెరికా పర్యటన నిమిత్తం ఐదు రోజుల కిందట అమెరికా వెళ్లి,శుక్రవారం స్వదేశానికి చేరుకున్నారు. అయితే స్వదేశానికి చేరుకున్న ఆయనకు కరోనా టెస్ట్ లు నిర్వహించగా పాజిటివ్ వచ్చినట్లు తెలుస్తుంది. దీనితో అందరూ ఒక్కసారిగా షాక్ అయ్యారు. ఎందుకంటే ఐదు రోజుల పర్యటన నిమిత్తం అమెరికా వచ్చిన ఆస్ట్రేలియా హోంమంత్రి పీటర్ వివిధ దేశాధినేతలతో భేటీ అయ్యారు. అయితే ఈ క్రమంలో ఆయన అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ సలహాదారు ఇవాంక ట్రంప్ తో కూడా సమావేశం అవ్వడం ప్రాధాన్యం సంతరించుకుంది. ఇవాంక తో భేటీ అయిన పీటర్ కు శుక్రవారం కరోనా పాజిటివ్ రావడం తో ఇప్పుడు ఈ వైరస్ ఇవాంక కు కూడా సోకివచ్చు అనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ఐదురోజుల పర్యటన ముగించుకుని స్వదేశానికి శుక్రవాదం నాడు చేరుకున్న పీటర్ కు వైద్య అధికారులు పరీక్షలు నిర్వహించగా కరోనా పాజిటివ్ తేలింది. దీనితో ఆయన్ని వెంటనే ఐసోలేషన్ వార్డుకు తరలించి చికిత్స అందిస్తున్నట్లు తెలుస్తుంది. అయితే పీటర్ తో ఇవాంక కూడా భేటీ అయిన నేపథ్యంలో ఆమెకు కూడా ఈ వైరస్ సోకవచ్చు అనే అనుమానాలు మొదలయ్యాయి.

ఇప్పటికే ఈ కరోనా దేశ ప్రధానులను కూడా వదిలిపెట్టడం లేదు అన్న విషయం తెలిసిందే. బ్రిటన్ ఆరోగ్యశాఖ మంత్రి,అలానే కెనడా ప్రధాని జస్టిస్ ట్రూడో భార్య సోఫీ గ్రెగొర్ కు కూడా కరోనా పాజిటివ్ తేలడం ఇంకా పలువురు రాజకీయ ప్రముఖులకు కూడా కరోనా సోకడం తో ప్రపంచ దేశాలు అప్రమత్తమయ్యాయి. కరోనా నేపథ్యంలో అమెరికా వీసా ప్రాసెస్ ను కూడా నిలిపివేస్తూ అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. అంతేకాకుండా భారత్ లో కూడా ఈ కరోనా వైరస్ తీవ్ర స్థాయిలో విజృంభిస్తుంది. దీనితో భారత్ నుంచి విదేశీ పర్యటనలను కూడా రద్దు చేస్తున్నట్లు సమాచారం.

Read more RELATED
Recommended to you

Latest news