కేసీఆర్.. అంటేనే క్రియేటర్, ఆయన చేసే ప్రతీ పని దేశానికి ఆదర్శంగా ఉంటుందంటే అతిశయోక్తి లేదు. కానీ ఇది నిజం. ఆయన నిర్వహించిన తెలంగాణ మలిదశ ఉద్యమం నుంచి నేటి వరకు ఆయన ప్రతీ అడుగు ఒక రికార్డుగా మారుతుంది. అలాంటి సంచలనాత్మక నిర్ణయమే తెలంగాణ రాష్ట్రముఖ్యమంత్రిగా ప్రాణాలను పణంగా పెట్టి హై అలర్డ్ ఉన్న కరీంనగర్లో పర్యటిస్తున్నారు. ఇప్పటికే కరీంనగర్కు వచ్చిన 8 మంది విదేశీయులకు కరోనా పాజిటివ్ నిర్ధారణ అయ్యింది.
ఈ నేపథ్యంలో ప్రజల్లో ధైర్యం నింపడమేకాకుండా పూర్తిస్తాయిలో ప్రజలలో పాలకుల పట్ల విశ్వాసం, నమ్మకం కలిగించడంతోపాటు యద్ధప్రాతిపదికన కరోనా గుర్తించిన చోట చేపట్టిన చర్యలను పరిశీలించడం, అవసరమైన మరిన్ని చర్యలు తీసుకునేందుకు కేసీఆర్ కరీంనగర్కు వెళ్తున్నారు. సరిగ్గా ఇక్కడ ఒక్క విషయం గుర్తుకు వస్తుంది. ప్రపంచంలో మొట్టమొదట కరోనా బయటపడ్డ చైనా నగరం, చైనా పూర్వరాజధాని అయిన వుహాన్లో మార్చి 10న ఆ దేశాద్యక్షుడు జిన్పింగ్ అక్కడ పర్యటించారు.
కానీ ఆయన కరోనా వైరస్ బయటపడ్డ మూడునెలల తర్వాత ఆ పర్యటన చేశారు. కానీ ముఖ్యమంత్రి కేసీఆర్ కరోనా బయటపడ్డ రెండురోజుల్లో అక్కడ పర్యటిచడం సహసోపేతమైన నిర్ణయం. పాలకులకు మార్గదర్శిగా మారిన ముఖ్యమంత్రి నిర్ణయానికి అందరూ హ్యాట్సాఫ్ చెప్తున్నారు.