ప్రపంచం మొత్తం ఇప్పుడు కరోనా దెబ్బకు అల్లాడిపోతుంది. వేలాది మందికి ఈ వ్యాధి సోకి పిట్టల్లా రాలిపోతున్నారు. అన్ని దేశాలు కూడా కరోనా దెబ్బకు వణికిపోయే పరిస్థితి ఏర్పడింది. కాని కరోనా వైరస్ చైనాలో పుట్టినా ఆ దేశం మాత్రం ఇప్పుడు చాలా సేఫ్ గా ఉంది. ఇన్నాళ్ళు కరోనా వైరస్ తో అక్కడ వేల కేసులు నమోదు అయ్యాయి. కాని గత నాలుగు రోజుల నుంచి ఒక్కటి అంటే ఒక్క కేసు కూడా నమోదు కాలేదు.
దీనికి కారణం ఏంటీ…? ఇప్పుడు ప్రపంచం మొత్తం చెప్తుంది ఒకటే మాట. కరోనా వైరస్ ని సృష్టించింది చైనా… దానికి మందు కనుక్కుంది కూడా చైనానే. తన దేశంలో పాతుకుపోతున్న విదేశీ పెట్టుబడిదారులను దేశం నుంచి తరిమేయడానికి చైనా కరోనా వైరస్ ని ప్రవేశ పెట్టింది. 80 వేల కేసులు నమోదు అయిన దేశంలో 75 వేల కేసులు నయం అయ్యాయి అంటేనే పరిస్థితి స్పష్టంగా అర్ధమవుతుంది.
చైనాలో కరోనా వైరస్ పుట్టినప్పుడు అక్కడ నమోదు అయిన ఉష్ణోగ్రత 3 డిగ్రీలు. ఇప్పుడు అక్కడ నమోదు అవుతుంది 6 డిగ్రీలు. కరోనా వైరస్ 22 డిగ్రీల ఉష్ణోగ్రత వరకు తట్టుకునే పరిస్థితి ఉంటుంది. అలాంటిది అక్కడ ఒక్క కేసు కూడా ఏ విధంగా నమోదు అవ్వడం లేదు అని ప్రపంచం ప్రశ్నిస్తుంది. అక్కడి ప్రజలకు కూడా తెలియకుండా చైనా మందు కనుక్కుని అక్కడి రోగులకు అందించింది.
ప్రపంచం మొత్తం విస్తరించే విధంగా చేసింది చైనా. కరోనా వైరస్ తగ్గుముఖం పట్టిన తర్వాత చైనాకు వచ్చిన సంపద ఒక లక్షా 52 వేల కోట్ల రూపాయలు. కాని ఇతర దేశాలు మాత్రం ఆర్ధికంగా కుంగిపోయాయి. ఇప్పుడు చైనా అత్యంత బలంగా ఉంది ఆర్ధిక వ్యవస్థలో. అమెరికా, ఇటలీ, ఫ్రాన్స్, భారత్ దేశాలు ఇప్పుడు ఇబ్బంది పడుతున్నాయి ఈ వైరస్ కారణంగా. వాస్తవాలు బయటపడితే మాత్రం అంతర్జాతీయ సమాజం చైనాను వెలి వేయాల్సిందే అని కోరుతున్నారు పలువురు.