బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత మరోసారి కాంగ్రెస్ పై సంచలన ఆరోపణలు చేసారు. కాంగ్రెస్ నిర్వహించిన బీసీ కులగణన తప్పుల తడకగా ఉందని విమర్శించారు. ముస్లింలు, బీసీలు, కలిపి 56 శాతం ఉండాలి.. కానీ రేవంత్ రెడ్డి 42 శాతమే ఇచ్చారన్నారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో ప్రత్యేక ఆర్డినెన్స్ ద్వారా బీసీ రిజర్వేషన్లు అమలు చేయవచ్చునని అన్నారు. కానీ కాంగ్రెస్ దానిని చేయదని, ప్రజలను మరోసారి మోసం చేసేందుకు సిద్ధం అయిందని, కాంగ్రెస్ DNAలోనే మోసం ఉందని మండిపడ్డారు. కాంగ్రెస్ బీజేపీపై ఒత్తిడి చేయకుండా.. పోరాటం చేసే మాపై విమర్శలు చేస్తే ఏం వస్తుందన్నారు.
ఆత్మగౌరవం ముఖ్యమని జైలు జీవితం నేర్పించిందని, జైల్లో స్వయంగా పేదల కష్టాలను చూశానని,
బెయిల్ కోసం డబ్బులు లేక నెలల తరబడి జైల్లో మగ్గుతున్నవారిని చూశానన్నారు. జైలుకు వెళ్లే
ముందే బీసీ ఇష్యూని తీసుకున్నానని, పూలే విగ్రహాన్ని ట్యాంక్ బండ్ పై పెట్టాలని కేసీఆర్
నిర్ణయించారు కానీ టెక్నికల్ సమస్యల వల్ల విగ్రహ ఏర్పాటు ఆగిందన్నారు. బీఆర్ఎస్ లో నేను లైఫ్
‘టైమ్ మెంబర్ నని, కేసీఆర్ అధికారంలో ఉన్నప్పుడు కూడా మహిళా బిల్లు కోసం ఢిల్లీలో ఆందోళన
చేశానని గురు చేసారు.