సాధారణంగా ప్రపంచ దేశాలలో ఉండే మీడియా తీరు వేరు, చైనా దేశంలో మీడియా తీరు వేరు. మామూలుగా ప్రపంచ దేశాలలో అయితే ప్రభుత్వాలు చేసే ప్రతి తప్పును మీడియా ఎత్తిచూపుతూ కడిగి పారేస్తుంది. అగ్రరాజ్యం అమెరికాలో కూడా అధ్యక్షుడు ట్రంప్ కి అనేక తలనొప్పులు తీసుకువచ్చింది ప్రతిపక్షాల కంటే మీడియా అని చాలా మంది చెబుతుంటారు. అదే సందర్భంలో బహిరంగంగానే ట్రంప్ మీడియాపై సీరియస్ అయిన సందర్భాలు ఉన్నాయి. ఇదిలా ఉండగా చైనా దేశంలో మాత్రం దానికి అంత రివర్స్ గా ఉంటది. చైనా దేశంలో మీడియా కి అసలు స్వేచ్ఛ అనేది ఉండదు. చాలా వరకు అంతా ప్రభుత్వం కంట్రోల్ లోనే ఉంటుంది. అందుకే ప్రపంచంలో చైనా దేశం లో ఏం జరుగుతుందో కూడా పెద్దగా ఎవరికీ ఏమీ తెలియదు. అటువంటి దేశంలో పుట్టిన కరోనా వైరస్ ప్రస్తుతం ప్రపంచాన్ని కకావికలం చేస్తుంది. మనిషి జీవనం ప్రశ్నార్థకంలో పడేసింది. ముందుగా ఈ వైరస్ చైనా దేశంలో వూహాన్ నగరంలో విజృంభించి అనేక మందిని బలితీసుకుంది. ఈ వైరస్ వల్ల తమ దేశంలో మూడు వేలకు పైగానే చనిపోయినట్లు, 80 వేల మందికి ఈ వైరస్ వ్యాపించినట్లు చైనా ప్రభుత్వం తెలిపింది.
అయితే అసలు విషయంలోకి వెళితే చైనాలో దాదాపు కొన్ని లక్షలకు పైగానే మనుషులు చనిపోయినట్లు కొన్ని సాలిడ్ ప్రూఫ్ లాంటి నిజాలు బయట పడటంతో అడ్డంగా దొరికింది. ఎలాగంటే చెన్నైలో కార్లలో వాడే సెక్యురిటి సిస్టం తయారీ యూనిట్ ఉందట. ఈ కంపెనీకి ప్రపంచంలోని చాలా దేశాల్లో క్లైంట్లున్నట్లే చైనాలో కూడా ఉన్నారట. చైనాలోని అనేక నగరాలతో పాటు వూహాన్ సిటిలో కూడా కంపెనీకి లక్షల్లోనే ఖాతాదారులున్నట్లు సమాచారం. వీళ్ళంతా ప్రతినెలా తమ సిస్టమ్ ను రీచార్జి చేసుకుంటుంటారు. అయితే గడచిన మూడు నెలలుగా లక్షల మంది ఖాతాదారులు తమ సిస్టమ్ ను రీచార్జి చేసుకోకపోవడంతో ఈ విషయం బయటపడింది. అదే టైములో సదరు కష్టమర్ కి ఫోన్ చేసినా గాని ఫోన్ నెంబర్లు పనిచేయటం లేదు అన్న దారుణమైన నిజం బయటపడింది. దీంతో మొత్తం లేదా చైనాలో కొన్ని లక్షల్లో మరణాలు సంభవించాయి, కానీ చైనా నిజాలు దాచేస్తుంది అంటూ ఇంటర్నేషనల్ స్థాయిలో వార్తలు వస్తున్నాయి.