జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మళ్ళీ సినిమాలకు బ్రేక్ ఇచ్చే అవకాశాలు ఉన్నాయా…? అంటే అవుననే సమాధానం వినపడుతుంది. టాలీవుడ్ లో పవన్ కళ్యాణ్ కి క్రేజ్ భారీగా ఉంది. అతనితో సినిమాలు చేయడానికి దర్శకులు ఎక్కువగా ఆసక్తి చూపిస్తారు. ప్రస్తుతం రాజకీయాలకు బ్రేక్ ఇచ్చిన ఆయన వరుసగా సినిమాలు చెయ్యాలని చూస్తున్నాడు. ప్రస్తుతం ఆయన వకీల్ సాబ్ అనే సినిమా చేస్తున్నాడు.
ఈ సినిమా దాదాపుగా షూటింగ్ పూర్తి చేసుకుంది. వచ్చే ఏడాది ఈ సినిమా విడుదల కానుంది. కరోనా వైరస్ కారణంగా ఈ ఏడాది సినిమాలు విడుదల చేసే అవకాశం లేదు కాబట్టి ఈ సినిమా విడుదల చేసే సూచనలు కనపడటం లేదు. ఈ సినిమా కోసం ఆయన ఇప్పటికే షూటింగ్ లో కూడా పాల్గొని పూర్తి చేసారు. ఇక ఈ సినిమా తర్వాత ఆయన క్రిష్ దర్శకత్వంలో ఒక సినిమా చేయడానికి రెడీ అయ్యారు.
ఈ రెండు సినిమాల తర్వాత హరీష్ శంకర్ తో ఒక సినిమా ప్లాన్ చేస్తున్నాడు. అయితే ఏమైందో ఏమో తెలియదు గాని ఈ సినిమాల తర్వాత ఆయన మళ్ళీ సినిమాలకు బ్రేక్ ఇచ్చే ఆలోచనలో ఉన్నాడని టాలీవుడ్ వర్గాలు అంటున్నాయి. దానికి స్పష్టమైన కారణం ఏంటీ అనేది తెలియదు. ఆ తర్వాత ఎన్నికల కోసం కష్టపడే అవకాశం ఉందని అంటున్నారు. అందుకే వేగంగా సినిమాలను పూర్తి చేస్తున్నారట పవన్.