ప్రస్తుతం మన టాలీవుడ్ తో పాటు మిగతా సినిమా ఇండస్ట్రీలో వాళ్ళు కూడా ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న భారీ బడ్జెట్ సినిమా ‘రౌద్రం రణం రుధిరం’ . రాజమౌళి ఈ సినిమాని అనౌన్స్ చేసినప్పటి నుంచి అంచనాలు బాగా నెలకొన్నాయి. ఇక జక్కన్న ఎప్పుడైతే రాం చరణ్, తారక్ ల ఫస్ట్ లుక్ రిలీజ్ చేశారో అప్పటి నుంచి ఇటు చిత్ర పరిశ్రమ తో పాటు ప్రేక్షకులలోను విపరీతంగా అంచనాలు పెరిగిపోయాయి. అంతేకాదు చరణ్ బర్త్ డే సందర్భంగా రిలీజ్ చేసిన టీజర్ తో ఈ సినిమా ఎలా ఉండబోతుందో ఊహించుకునేలా చేశారు చిత్ర యూనిట్.
ఇక ఫస్ట్ లుక్ రిలీజ్ చేసినప్పటి నుంచి రాజమౌళి ఈ సినిమా మీద అంచనాలను పబ్లిసిటీ తో బాగా పీక్స్ కి తీసుకువెళుతున్నారు. ఇది ఆయనకి కొత్తేమి కాదు. మొదటి నుంచి తన సినిమాను పబ్లిసిటీ చేసుకోవడంలో ప్రేక్షకుల్లో క్రేజ్ ని క్రియోట్ చేయడం లో రాజమౌళి స్ట్రాటజీనే వేరు. కరోనా సమస్య ఉన్నప్పటికి అదేమి పట్టించుకోకుండా మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ పుట్టిన రోజు సందర్భంగా ‘భీమ్ ఫర్ రామరాజు’ అంటూ ఎన్టీఆర్ ఒక స్పెషల్ వీడియోని విడుదల చేసి షాకిచారు. ఈ వీడియో టీజర్ ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది. దాంతో ఇప్పుడు ఎన్టీఆర్ ఈ సినిమాలో ఎలా ఉండబోతున్నాడన్న ఆసక్తి ఎన్టీఆర్ ఫ్యాన్స్ తో పాటు యావత్ ప్రేక్షకులకి బాగా పెరిగిపోయింది. అయితే ఇప్పుడు ఎన్టీఆర్ వీడియోకి సంబంధించి ఒక లేటెస్ట్ అప్‌డేట్ వచ్చింది.
ఎన్టీఆర్ పుట్టినరోజు ఈ సందర్భంగా ఎన్టీఆర్ కి బర్త్ డే గిఫ్టుగా రామ్ చరణ్ కూడా ‘రామరాజు ఫర్ భీమ్’ అన్న ఒక స్పెషల్ వీడియో రెడీ చేపిస్తున్నాడ తాజా సమాచారం. ఇది చూసిన ప్రతీ ఒక్కరు ‘రౌద్రం రణం రుధిరం’ లో తారక్ ఎవరూ ఊహించని రేంజ్ లో కనిపిస్తాడని చిత్ర యూనిట్ చెప్పుకుంటున్నారట. ఇక చరణ్ వీడియో కంటే ఇంకా ఎఫెక్టివ్ గా ఈ వీడిలో కొన్ని పవర్ ఫుల్ డైలాగ్స్ తో పాటు సీన్స్ ని రివీల్ చేస్తారట. ఇది చూస్తే ఒక్క ఎన్.టి.ఆర్ ఫ్యాన్సే కాదు మిగతా ప్రేక్షకులు ఉత్సాహం తో ఊగిపోతారట. ఇక డీవీవీ దానయ్య నిర్మిస్తున్న ఈ సినిమాలో బాలీవుడ్ స్టార్స్ అజయ్ దేవగన్, అలియా భట్ నటిస్తున్న సంగతి తెలిసిందే. 20121 జనవరి 8 న ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ కానుంది.