కేంద్ర ప్రభుత్వం విధించిన లాక్ డౌన్ అమలు చేయడానికి రాష్ట్ర ప్రభుత్వాలు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయి. పోలీసులను ఎంతగానో బందోబస్తు పెట్టిన గాని ప్రజలు ఇంటి నుండి బయటకు వచ్చేస్తూ అనేక ఇబ్బందులను సృష్టిస్తున్నారు. దీంతో పోలీసులు పలు రాష్ట్రాలలో లాఠీలకు పని చెప్పాల్సి వస్తుంది. ఇటువంటి పరిస్థితుల్లో ఒక మనిషికి వైరస్ సోకిన ఆ ప్రాంతం అంతటికి వైరస్ ప్రబలే అవకాశం ఉండటంతో చాలా బాధ్యతాయుతంగా పోలీసులు తమ కుటుంబాలను పక్కన పెట్టి ప్రాణాలను పణంగా పెట్టి డ్యూటీ చేస్తున్నారు. ఇటువంటి తరుణంలో కొన్నిచోట్ల చెదురుమదురు ఘటనలు వల్ల కొంతమందిపై లాఠీకి పని చెప్పిన క్రమంలో వచ్చిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవటంతో అటు ప్రభుత్వానికి ఇటు ప్రజలకు మధ్య ఏం చేయలేని అయ్యో పాపం అన్నా స్థితిలో పోలీస్ వ్యవస్థ ప్రస్తుతం మారింది.ఇటువంటి తరుణంలో ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో ఓ ప్రముఖ పోలీస్ ఆఫీసర్ ప్రజలు ఇష్టానుసారంగా వ్యవహరించే వారిపట్ల కిందిస్థాయి పోలీసులకు ఇచ్చిన సూచనలు ఇప్పుడు దేశవ్యాప్తంగా హాట్ టాపిక్ అయ్యాయి. సదరు పోలీస్ ఆఫీసర్ ఇచ్చిన సూచనలు ఏమిటంటే లాక్ డౌన్ టైమ్ లో పబ్లిక్ ఎవరు కనబడిన మర్యాదగా మాట్లాడాలని సహాయం కోరి వచ్చిన వారికి ముందు గ్లాసు మంచినీళ్ళు ఇచ్చి తరువాత వాడితో డిస్కషన్స్ స్టార్ట్ చేయాలని సూచించారట. ఒకవేళ వాళ్ళకి ఆకలి వేస్తే అన్నం కూడా పెట్టాలని పేర్కొన్నారని సమాచారం.
ఏది ఏమైనా పబ్లిక్ మీద లాఠీ పడకుండా మంచి మాటకారితనం తోనే వాళ్లను ఇంటికి పంపించాలి అని సదరు అధికారి కిందిస్థాయి పోలీసులకు సూచించారు. మొత్తం మీద ప్రజల ప్రాణాలను కాపాడుతున్న ప్రజలను కంట్రోల్ చేయడానికి వారు అనుసరిస్తున్న విధానాలు పాపం అన్నట్టుగా మారాయని కొంతమంది అంటున్నారు. పబ్లిక్ కూడా రోడ్డుపై డ్యూటీ చేస్తున్న పోలీసుల పట్ల బాధ్యతగా వ్యవహరించాలని కోరుతున్నారు సోషల్ మీడియాలో నెటిజన్లు కోరుతున్నారు.