ఆ అమ్మాయికి 14 ఏళ్లు. అతడికి 23 ఏళ్లు. అతడు ఆ అమ్మాయికి బాబాయి వరస అవుతాడు. కానీ… ప్రేమ వాళ్లిద్దరినీ కలిపింది. ఇద్దరు కొన్ని రోజులు ప్రేమలో మునిగితేలారు. ఈ విషయం పెద్దలకు తెలియడంతో మందలించారు. దీంతో వాళ్లు ఇంట్లోంచి పారిపోయారు. హైదరాబాద్ కు పారిపోయారు. బాలిక తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో వాళ్లను హైదరాబాద్ లో పట్టుకొని ఊరికి తీసుకొచ్చారు. యువకుడిని మాత్రం కిడ్నాప్ కేసు కింద జైల్లో వేశారు.
కట్ చేస్తే రెండు నెలల క్రితం ఆ యువకుడు జైలు నుంచి విడుదలయ్యాడు. మళ్లీ ఆ అమ్మాయితో మాట్లాడటానికి ప్రయత్నించాడు. దీంతో ఈ విషయం ఆ అమ్మాయి తల్లికి తెలిసి మందలించింది. దీంతో మనస్తాపం చెందిన రేణుక ఈనెల 12న ఆత్మహత్య చేసుకున్నది. పురుగుల మందు తాగింది. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందింది. ఆ యువకుడి కారణంగానే మా బిడ్డ చనిపోయిందంటూ ఆ అమ్మాయి బంధువులు అతడి కుటుంబంతో గొడవ పెట్టుకున్నారు. ఇంతలోనే ఆ యువకుడు కూడా పురుగుల మందు తాగాడు. ఆత్మహత్య చేసుకున్నాడు. అలా వాళ్ల ప్రేమ కథ అక్కడితో ముగిసిపోయింది. పసిప్రాయంలోనే అ అమ్మాయి తనువు చాలించింది. ప్రేమ కథను ముగింపు పలికింది. ఆ యువకుడు కూడా తనతో పాటే జీవితం అని తన దగ్గరికే వెళ్లిపోయాడు. ఈ ఘటన రంగారెడ్డి జిల్లా కడ్తాల్ లో చోటు చేసుకున్నది.