బతుకమ్మ అంటే ఎంత ఉంటది చెప్పండి.. మా.. అంటే ఒక అడుగు.. రెండు అడుగులు.. కానీ ఈ బతుకమ్మ చూడండి.. ఏకంగా 42 అడుగులు ఉంది.. షాకయ్యారా? దీన్ని తయారు చేయడం అంత వీజీ కాదు. ఈ భారీ బతుకమ్మను ఖమ్మం జిల్లాలోని కూసుమంచి మండలం పెరికసింగారంలో తయారు చేవారు. ఈ బతుకమ్మను తయారు చేయడానికి ఐదు రోజులు పట్టిందట. ఈ బతుకమ్మ కోసం మూడు ట్రక్కుల టేకు పువ్వులు, రెండు ట్రక్కుల తంగేడు పువ్వులు, మూడు క్వింటాళ్ల బంతిపూలు, రకరకాల పువ్వులను ఉపయోగించారట. 70 మంది రాత్రింబవళ్లు కష్టపడి ఈ బతుకమ్మను పేర్చారట. వావ్.. సూపర్ కదా. ఇక.. ఎంత కష్టపడి చేసినా.. చివరకు దాన్ని నీళ్లలో నిమజ్జనం చేయాల్సిందే కదా. సద్దుల బతుకమ్మ సందర్భంగా దాన్ని ట్రాక్టర్‌లో తీసుకెళ్లి బతుకమ్మ ఆడిపాడి సాగర్ కాలువలో నిమజ్జనం చేశారు.