వి హెచ్‌ పై కేసు…!

-

సాధారణంగానే చాలా ఓపెన్‌గా, ముక్కుసూటిగా ఉండే వి.హనుమంతరావు కాంగ్రెస్‌ పార్టీలో దశాబ్దాల నేత. ఆయనకు ఎదురుమాట్లాడాలంటేనే హడల్‌.

కాంగ్రెస్‌ సీనియర్‌ నేతవి.హనుమంతరావుపై పోలీసులు కేసులు నమోదు చేసారు. అంబేద్కర్‌ జయంతి సందర్భాన్ని పురస్కరించుకుని, టాంక్‌బండ్‌ వద్ద గల ఆయన విగ్రహానికి పూలమాలలు అలంకరించేందుకు విహెచ్‌ వచ్చారు. అయితే కరోనా లాక్‌డౌన్‌ సమయంలో నిబంధనలను అతిక్రమించి ప్రయాణించినందుకు ఆయనపై సైఫాబాద్‌ పోలీసులు కేసులు నమోదుచేసారు.

కరోనా పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని పోలీసులు నిన్ననే అంబేద్కర్‌ విగ్రహానికి పూలమాలలు వేయడానికి ప్రజలు ఎవరూ రావద్దని ప్రకటించారు. అయినప్పటికీ నేడు కొంతమంది దళిత నేతలు, రాజకీయ నాయకులు ట్యాంకుబండ్‌కు చేరుకున్నారు.

అయితే అప్పటికే ఈ పరిణామాన్ని ఊహించిన పోలీసులు అక్కడ బందోబస్తు ఏర్పాటు చేసారు. ఇది తెలియని విహెచ్‌ అక్కడికి చేరుకుని, విగ్రహానికి మాలనలంకరించడానికి ఉద్యుక్తులవగా, పోలీసులు వారించారు.  ఈ సందర్భంగా హనుమంతరావుకు, పోలీసులకు మధ్య స్వల్ప వాగ్వాదం చేటు చేసుకుంది. అయినప్పటికీ విహెచ్‌ వినకపోవడంతో ఆయన మీద పలు ఐపీసీ సెక్షన్లతో కేసు నమోదు చేసారు.

Read more RELATED
Recommended to you

Latest news