చైనాకు చెందిన మొబైల్స్ తయారీదారు వన్‌ప్లస్ తన నూతన ఫ్లాగ్షిప్ స్మార్ట్ఫోన్లు.. వన్‌ప్లస్ 8, వన్‌ప్లస్ 8ప్రొలను తాజాగా విడుదల చేసింది. కాగా ప్రతి సారీ వన్‌ప్లస్ తన నూతన స్మార్ట్ఫోన్లను విడుదల చేసే ఈవెంట్లను ప్రపంచంలోని పలు ప్రముఖ నగరాల్లో ఏకకాలంలో నిర్వహించేది. కానీ కరోనా కారణంగా వన్‌ప్లస్ 8 ఫోన్లను ఆ సంస్థ ప్రస్తుతం ఆన్లైన్లోనే విడుదల చేసింది. ఇక ఈ ఫోన్లలో అందిస్తున్న ఫీచర్ల వివరాలు ఈ విధంగా ఉన్నాయి.
వన్‌ప్లస్ 8…
ఇందులో 6.55 ఇంచుల ఫుల్ హెచ్డీ ప్లస్ ఫ్లూయిడ్ అమోలెడ్ డిస్ప్లేను ఏర్పాటు చేశారు. దీనికి 90 హెడ్జ్ రిఫ్రెష్ రేట్‌ను అందిస్తున్నారు. ఇక ముందు భాగంలో 16 మెగాపిక్సల్ ఇన్ స్క్రీన్ కెమెరాను ఏర్పాటు చేశారు. ఈ ఫోన్‌కు గొరిల్లా గ్లాస్ ప్రొటెక్షన్‌ను అందిస్తున్నారు. ఇందులో ఆక్టాకోర్ స్నాప్‌డ్రాగన్ 865 ప్రాసెసర్, 5జి, 12జీబీ ర్యామ్, ఆండ్రాయిడ్ 10 వంటి అధునాతన ఫీచర్లను అందిస్తున్నారు. ఈ ఫోన్లో వెనుక భాగంలో 48 మెగాపిక్సల్ మెయిన్ కెమెరాను ఏర్పాటు చేశారు. దీనికి తోడుగా 16, 2 మెగాపిక్సల్ కెపాసిటీ ఉన్న మరో రెండు కెమెరాలు కూడా ఉన్నాయి. అలాగే డాల్బీ అట్మోస్, ఇన్‌డిస్‌ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్, 4300 ఎంఏహెచ్ బ్యాటరీ, వార్ప్ చార్జ్ 30టి ఫాస్ట్ చార్జింగ్ ఫీచర్లను కూడా ఈ ఫోన్లో అందిస్తున్నారు. ఇక ఈ ఫోన్‌ను కేవలం 22 నిమిషాల వ్యవధిలోనే 1 శాతం నుంచి 50 శాతం వరకు చార్జింగ్ చేసుకోవచ్చు.
వన్‌ప్లస్ 8 స్పెసిఫికేషన్లు…
* 6.55 ఇంచుల ఫుల్ హెచ్డీ ప్లస్ ఫ్లూయిడ్ అమోలెడ్ డిస్ప్లే, 90 హెడ్జ్ రిఫ్రెష్ రేట్
* 1080 x 2400 పిక్సల్స్ స్క్రీన్ రిజల్యూషన్, 3డి కార్నింగ్ గొరిల్లా గ్లాస్ ప్రొటెక్షన్
* 2.84 గిగాహెడ్జ్ ఆక్టాకోర్ స్నాప్‌డ్రాగన్ 865 ప్రాసెసర్, 8/12 జీబీ ర్యామ్
* 128/256 జీబీ స్టోరేజ్, ఆండ్రాయిడ్ 10, డ్యుయల్ సిమ్
* 48, 16, 2 మెగాపిక్సల్ బ్యాక్ కెమెరాలు, 16 మెగాపిక్సల్ ఫ్రంట్ కెమెరా
* ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్, యూఎస్బీ టైప్ సి ఆడియో, డాల్బీ అట్మోస్
* 5జి, డ్యుయల్ 4జి వీవోఎల్టీఈ, వైఫై 6 802.11 ఏఎక్స్ 2X2 ఎంఐఎంవో
* బ్లూటూత్ 5.1, యూఎస్బీ టైప్ సి
* 4300 ఎంఏహెచ్ బ్యాటరీ, వార్ప్ చార్జ్ 30టి ఫాస్ట్ చార్జింగ్
వన్‌ప్లస్ 8 ప్రొ…
వన్‌ప్లస్ 8 ప్రొ స్మార్ట్‌ఫోన్‌లో.. 6.78 ఇంచ్ క్వాడ్ హెచ్డీ ప్లస్ ఫ్లూయిడ్ అమోలెఎడ్ ఎడ్జ్-టు-ఎడ్జ్ డిస్ప్లేను ఏర్పాటు చేశారు. ఇది 120 హెడ్జ్ రిఫ్రెష్ రేట్‌ను కలిగి ఉంది. ఇందులోనూ ముందు భాగంలో 16 మెగాపిక్సల్ ఇన్ స్క్రీన్ కెమెరాను ఏర్పాటు చేశారు. ఈ ఫోన్‌కు కూడా గొరిల్లా గ్లాస్ ప్రొటెక్షన్‌ను అందిస్తున్నారు. ఇందులోనూ ఆక్టాకోర్ స్నాప్‌డ్రాగన్ 865 ప్రాసెసర్, 5జి, 12 జీబీ వరకు ర్యామ్, ఆండ్రాయిడ్ 10 ఓఎస్ తదితర అధునాతన ఫీచర్లను అందిస్తున్నారు. ఈ ఫోన్‌కు వెనుక భాగంలో 48 మెగాపిక్సల్ మెయిన్ కెమెరాతోపాటు మరో 48 మెగాపిక్సల్ కెపాసిటీ ఉన్న అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరా, 8 మెగాపిక్సల్ 3ఎక్స్ టెలిఫొటో కెమెరా, 5 మెగాపిక్సల్ మోనో సెన్సార్‌ను ఏర్పాటు చేశారు. ఇక ఈ ఫోన్లో డాల్బీ అట్మోస్, ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్, 4510 ఎంఏహెచ్ బ్యాటరీని ఏర్పాటు చేశారు. ఈ బ్యాటరీకి వార్ప్ చార్జ్ 30టి ఫాస్ట్ చార్జింగ్ సపోర్ట్‌ను అందిస్తున్నారు. అందువల్ల ఫోన్‌ను 0 నుంచి 50 శాతం వరకు చార్జింగ్‌ను పూర్తి చేసేందుకు కేవలం 23 నిమిషాల సమయం మాత్రమే పడుతుంది. ఇక ఈ ఫోన్లో వైర్లెస్ రివర్స్ చార్జింగ్కు సపోర్ట్‌ను అందిస్తున్నారు.
వన్‌ప్లస్ 8 ప్రొ స్పెసిఫికేషన్లు…
* 6.78 ఇంచ్ క్వాడ్ హెచ్డీ ప్లస్ ఫ్లూయిడట్ అమోలెడ్ డిస్ప్లే, 120 హెడ్జ్ రిఫ్రెష్ రేట్
* 3168 x 1440 పిక్సల్స్ స్క్రీన్ రిజల్యూషన్, గొరిల్లా గ్లాస్ ప్రొటెక్షన్
* 2.84 గిగాహెడ్జ్ ఆక్టాకోర్ స్నాప్‌డ్రాగన్ 865 ప్రాసెసర్, 8/12 జీబీ ర్యామ్
* 128/256 జీబీ స్టోరేజ్, ఆండ్రాయిడ్ 10, డ్యుయల్ సిమ్
* 48, 48, 8, 5 మెగాపిక్సల్ బ్యాక్ కెమెరాలు, 16 మెగాపిక్సల్ ఫ్రంట్ కెమెరా
* ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్, యూఎస్బీ టైప్ సి ఆడియో
* డాల్బీ అట్మోస్, 3డి ఆడియో, ఆడియో జూమ్, ఓజో ఆడియో
* ఐపీ 68 వాటర్, డస్ట్ రెసిస్టెన్స్, 5జి, డ్యుయల్ 4జి వీవోఎల్టీఈ
* వైఫై 6 802.11 ఏఎక్స్ 2×2 ఎంఐఎంవో, బ్లూటూత్ 5.1
* 4510 ఎంఏహెచ్ బ్యాటరీ, వార్ప్ చార్జ్ 30టి ఫాస్ట్ చార్జింగ్
* 30వాట్ల వైర్లెస్ ఫాస్ట్ చార్జింగ్, వైర్లెస్ రివర్స్ చార్జింగ్
ధరలు…
వన్‌ప్లస్ 8 సిరీస్ ఫోన్ల ధరలను భారత్‌లో ఇంకా వెల్లడించలేదు. కానీ ఈ ఫోన్ల ధరలు అమెరికా మార్కెట్లో ఈ విధంగా ఉన్నాయి.
* వన్‌ప్లస్ 8 స్మార్ట్‌ఫోన్‌కు చెందిన 8జీబీ ర్యామ్, 128 జీబీ స్టోరేజ్ వేరియెంట్ ధర 699 డాలర్లు (దాదాపుగా రూ.53,100) ఉండగా, 12జీబీ ర్యామ్, 256 జీబీ స్టోరేజ్ వేరియెంట్ ధర 799 డాలర్లు (దాదాపుగా రూ.60,700) గా ఉంది. ఇక ఈ ఫోన్‌ను అమెరికా మార్కెట్లో ఏప్రిల్ 29వ తేదీ నుంచి విక్రయించనున్నారు. అలాగే యూకేలో ఏప్రిల్ 21వ తేదీ నుంచి విక్రయిస్తారు. అందుకు గాను ఆయా దేశాల్లో ఇప్పటికే ఈ ఫోన్‌కు ప్రీ ఆర్డర్లను ప్రారంభించారు.
* వన్‌ప్లస్ 8 ప్రొ స్మార్ట్‌ఫోన్‌కు చెందిన 8జీబీ ర్యామ్, 128 జీబీ స్టోరేజ్ వేరియెంట్ ధర 899 డాలర్లు (దాదాపుగా రూ.68,290) ఉండగా, 12జీబీ ర్యామ్, 256 జీబీ స్టోరేజ్వేరియెంట్ ధర 999 డాలర్లు (దాదాపుగా రూ.75,885)గా ఉంది. ఈ ఫోన్‌ను యూరప్, యూకే మార్కెట్లలో ఏప్రిల్ 21వ తేదీ నుంచి విక్రయిస్తారు. ఈ ఫోన్‌కు కూడా ఆయా దేశాల్లో బుధవారం నుంచే ప్రీ ఆర్డర్లను ప్రారంభించారు.
ఇక వన్‌ప్లస్ 8 సిరీస్ స్మార్ట్ఫోన్లకు గాను వినియోగదారులు వార్ప్ చార్జ్ 30 వైర్లెస్ చార్జర్‌ను ప్రత్యేకంగా కొనుగోలు చేయవచ్చు. దీని ధర 69.95 డాలర్లు (దాదాపుగా రూ.5,310)గా ఉంది. అయితే ఈ ఫోన్లను అమెజాన్ భారత్‌లో మే నెలలో విక్రయించే అవకాశం ఉందని తెలిసింది. కానీ భారత్‌లో ఈ ఫోన్ల ధరలను మాత్రం అమెజాన్ వెల్లడించలేదు..!