ఏయన్నార్ తో నానికి పోలికా..!

-

నాగార్జున, నాని కాంబినేషన్ లో శ్రీరాం ఆదిత్య డైరక్షన్ లో వచ్చిన సినిమా దేవదాస్. యావరేజ్ మూవీగా నిలచిన ఈ సినిమా 50 రోజుల వేడుక జరుపుకున్నారు చిత్రయూనిట్ ఈ వేడుకలో భాగంగా నానిపై ప్రశంసల వెళ్లువ కురిపించాడు కింగ్ నాగార్జున. నాని సినిమాలు ఎప్పటినుండో చూస్తున్నా అని నానిని చూస్తుంటే తన తండ్రి కెరియర్ మొదట్లో చేసిన సినిమాలు గుర్తుకొస్తాయని అన్నారు. ఏకంగా ఏయన్నార్ తో నానిని పోల్చి తన మంచి గొప్ప మనసు చాటుకున్నాడు నాగార్జున.

ఇక నాని కూడా ఇదవరకు నాగ్ సార్ ను చూస్తే శివ గుర్తొచ్చేది కాని ఇప్పుడు దేవా గుర్తొస్తున్నాడు అన్నాడు. సినిమా 50 డేస్ ఫంక్షన్ లో చిత్ర నిర్మాత అశ్వనిదత్ సినిమాలో హీరోయిన్ గా నటించిన రష్మిక పాల్గొన్నారు. ప్రస్తుతం నాని జెర్సీ సినిమా చేస్తున్నాడు. గౌతం తిన్ననూరి డైరక్షన్ లో వస్తున్న ఈ సినిమా క్రికెట్ ఆట నేపథ్యంలో సాగుతుందట. ఈ సినిమాలో హీరోయిన్ గా కన్నడ భామ శ్రద్ధ శ్రీనాథ్ నటిస్తుంది.

Read more RELATED
Recommended to you

Latest news