ఇలాంటి మనుషులు ఉంటే కరోనా కట్టడి అవుతుందా…?

-

ప్రపంచానికి చుక్కలు చూపిస్తున్న కరోనా వైరస్ కట్టడి కావాలి అంటే నివారణ ఒక్కటే మార్గం. అంటే సామాజిక దూరం పాటించాలి. జనాలు ఎవరూ కూడా బయటకు రాకూడదు. బయటకు రాకుండా ఉండాలని ప్రభుత్వాలు ఎన్ని విధాలుగా చెప్తున్నా సరే ఎవరూ కూడా వినడం లేదు. ఇష్టం వచ్చినట్టు బయటకు వస్తున్నారు. ఎద్దు అంత్యక్రియలకు వేలాది మంది పాల్గొన్నారు తమిళనాడులో. పక్కింటి వాళ్ళు ఫంక్షన్ కోసం భారీగా బయటకు వచ్చారు.

పక్కింటి లో ఏదైనా కార్యక్రమం జరుగుతుంది అంటే కొన్ని గ్రామాల్లో ఫ్యామిలీ ఫ్యామిలీ మొత్తం వెళ్తుంది. పుట్టిన రోజు కార్యక్రమాలకు ఉయ్యాలలో వేసే కార్యక్రమాలకు భారీగా వెళ్తున్నారు. ఇక కొడుకు పుట్టిన రోజు కార్యక్రమాన్ని ఒక తండ్రి చాలా ఘనంగా చేసాడు తమిళనాడులో. ఉత్తరప్రదేశ్ లో కూడా ఒక తండ్రి ఇలాగే చేసాడు. కేసులు ఎక్కువగా ఉన్న మహారాష్ట్రలోని పూణే సమీపంలో ఒక రిసెప్షన్ వేడుక చేసారు.

ఇక మరో చోట అమ్మాయి పెళ్లి కార్యక్రమాన్ని బంధు మిత్రులు అందరిని పిలిచి ఘనంగా చేసారు. ఎవరూ కూడా మాట వినే పరిస్థితి అనేది ఎక్కడా కనపడటం లేదు, ఎవరి ఇష్టం వచ్చినట్టు వాళ్ళు ప్రవర్తిస్తున్నారు గాని ఎవరూ కూడా అర్ధం చేసుకునే పరిస్థితి అనేది కనపడట౦ లేదు. పరిస్థితి ఎంత భయంకరంగా ఉన్నా సరే ఎవరూ కూడా వినడం లేదు. కొడితే కొట్టారు తిడితే తిట్టారు అంటూ విమర్శలు చేస్తున్నారు గాని మాట వినే పరిస్థితి లేదు

Read more RELATED
Recommended to you

Latest news