అగ్ర రాజ్యం అమెరికాలో కరోనా వైరస్ కంటి మీద కునుకు లేకుండా చేస్తుంది, ప్రతీ రోజు వేల కేసులు నమోదు అవుతున్నాయి. ఏ విధంగా చూసినా సరే కరోనా వైరస్ అనేది అమెరికాలో కట్టడి అయ్యే పరిస్థితి కనపడటం లేదు. రోజు రోజుకి కేసులు పెరగడమే కాదు మరణాల సంఖ్య కూడా వేగంగా పెరుగుతుంది. శుక్రవారం 31631 కేసులు నమోదు కాగా మొత్తం కేసుల సంఖ్య 709201కి చేరింది.
అకడ శుక్రవారం 2516 మంది చనిపోయారు. దీనితో ఇప్పటి వరకు అమెరికాలో మొత్తం మరణాల సంఖ్య 37135కి చేరింది. న్యూయార్క్ లో దాదాపు 14 వేల మంది అక్కడ ప్రాణాలు కోల్పోయారు. ఆ దేశ అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ కూడా రాష్ట్రాల మీద పూర్తి అధికారాలను గవర్నర్ లకే ఇస్తూ నిర్ణయం తీసుకున్నారు. లక్షల కేసులు ఇంకా నమోదు అయ్యే అవకాశాలే ఎక్కువగా కనపడుతున్నాయి అమెరికాలో.
ప్లాస్మా చికిత్సకు మంచి స్పందన వస్తుందని భావించినా ఇంకా కేసులు పెరుగుతూనే ఉన్నాయి. దీనితో ఇప్పుడు బాధితులు పెరుగుతున్నారు. ఇక అధ్యక్షుడు ట్రంప్ కూడా ఇప్పుడు లాక్ డౌన్ ని మరింతగా పెంచే ప్రయత్నాలు చేస్తున్నారు. న్యూయార్క్ ని ఇప్పట్లో రీ ఓపెన్ చేయవద్దు అని ఆయన సూచించినట్టు సమాచారం. ఇక రెండు వారాల్లో అక్కడ మరణాలు పెరిగే అవకాశం ఉంది.