సర్కార్ టీజర్.. మురుగదాస్ ఫాం లోకి వచ్చినట్టే..!

-

మహేష్, మురుగదాస్ కాంబినేషన్ లో వచ్చిన స్పైడర్ భారీ అంచనాలతో వచ్చి డిజాస్టర్ గా మిగిలిపోయింది. ఆ సినిమా అటు మురుగదాస్ కు ఇటు మహేష్ కు చేదు అనుభవాన్ని మిగిల్చింది. ఇక ఎలాగు మహేష్ భరత్ అనే నేను సినిమా హిట్ కొట్టి లైన్ లోకి వచ్చాడనుకోండి. అయితే ప్రస్తుతం మురుగదాస్ కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ తో సర్కార్ సినిమా చేస్తున్నాడు. దీపావళి కానుకగా ఆ సినిమా రిలీజ్ కానుంది.

దసరా సందర్భంగా సర్కార్ సినిమా టీజర్ రిలీజ్ చేశారు చిత్రయూనిట్. టీజర్ తోనే సినిమా కంటెంట్ ఏంటో చెప్పేసిన దాస్ సినిమాతో మరోసారి రాజకీయ ప్రక్షాళన చేసేలా ఉన్నాడు. అసలే విజయ్ పొలిటికల్ పార్టీ పెట్టే ఆలోచనలో ఉన్నాడని తెలుస్తుండగా అందుకు తగినట్టుగానే ప్రజల పక్షాన మాట్లాడే నాయకుడిగా విజయ్ ఈ సినిమాలో కనిపిస్తున్నాడు. టీజర్ మాత్రం అదరగొట్టేసింది. మరి తెలుగులో డబ్ చేసి రిలీజ్ చేస్తారో లేక రీమేక్ చేస్తారో చూడాలి.

Read more RELATED
Recommended to you

Latest news