సాధారణంగా.. దసరా రోజు ఎవరి దిష్టిబొమ్మను దహనం చేస్తారు అంటే టక్కున రావణ దహనం అని అంటాం. కానీ.. వీళ్లు కాస్త డిఫరెంట్ బాసు.. వాళ్లు రావణుడి దిష్టిబొమ్మను కాదు.. ఆయన సోదరి శూర్పనఖ దిష్టిబొమ్మను దహనం చేసి ఔరా అనిపించుకున్నారు. మహారాష్ట్రలోని ఔరంగాబాద్‌లో కొందరు భార్య బాధితులే ఇలా శూర్పనఖ దిష్టిబొమ్మను దహనం చేసింది. భర్తలను హింసిస్తున్న భార్యలకు వ్యతిరేకంగా ఇలా ఆమె దిష్టిబొమ్మను దహనం చేశారట. పత్ని పీడిత్ పురుష్ అనే ఓ సంస్థ ఇలా భార్య బాధితులతో శూర్పనఖ దిష్టిబొమ్మను దహనం చేయించింది. ఇండియాలో మహిళలకు అనుకూలంగా ఉన్న చట్టాలను వాళ్లు దుర్వినియోగం చేస్తూ భార్యలు.. భర్తలను హింసిస్తున్నారని ఆ చట్టాలన్నీ పురుషులకు అనుకూలంగా మార్చాలంటూ వాళ్లు ఇలా నిరసన చేపట్టారట. కొత్తగా ఉంది కదా వీళ్ల కాన్సెప్ట్.
వీళ్లు డిఫరెంటు.. రావణుడికి బదులు శూర్పనఖను దహనం చేశారు..!
-