ఉద్యోగం నుంచి తొలగిస్తే ఇలా ఫిర్యాదు చేయండి…!

-

లాక్ డౌన్ లో నష్టాలు ఎదుర్కోలేక చాలా సంస్థలు తమ ఉద్యోగులను తొలగించడం మొదలుపెట్టాయి. అసలే లాక్ డౌన్ తో మరో ఆదాయం లేని ఉద్యోగులు లక్షల మంది ఉద్యోగులు కోల్పోతూ రోడ్డున పడ్డారు. చిన్న కంపెనీల నుంచి పెద్ద కంపెనీల వరకు అన్నీ కూడా లాక్ డౌన్ లో భారీగా ఉద్యోగులను తొలగించడం మొదలుపెట్టాయి. దీనితో కొందరు ఉద్యోగులు ఇప్పుడు ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితి ఏర్పడింది. ప్రధాని చెప్పినా సరే ఉద్యోగులను తొలగిస్తున్నారు. దీనితో కేంద్రం ఫిర్యాదు చేసే అవకాశాన్ని కల్పించింది.

జీతాలు ఇవ్వకపోయినా, ఉద్యోగ౦ నుంచి తొలగించినా తక్కువ జీతాలు ఇచ్చినా సరే ఫోన్ లేదా వాట్సాప్ నుంచి ఫిర్యాదు చెయ్యాలి. ప్రైవేట్ కంపెనీల్లో పని చేస్తున్న కార్మికులు, ఇతర రాష్ట్రాల నుంచి వలస వచ్చిన కార్మికులు, తెలంగాణలోని ఇతర జిల్లాల నుంచి పట్టణ ప్రాంతాల్లో పనిచేస్తున్న కార్మికులు, షాపుల్లో, దుకాణాల్లో, ఇతర ప్రైవేట్ వ్యాపార సంస్థల్లో పనిచేసే వారు ఫిర్యాదు చేసే అవకాశం ఉంటుంది.

కంప్లైంట్ ఇవ్వాల్సిన విధానం :
కంప్లైంట్ ఇచ్చే వ్యక్తి పేరు :

కంప్లైంట్ ఇచ్చే వ్యక్తి ఫోన్ నెంబర్ :
పని చేసే సంస్థ పేరు :

సంస్థ /ఆఫీసు చిరునామా (మండలం, జిల్లా) :
యజమాని పేరు :యాజమాని ఫోన్ నెంబర్ :
సంస్థలో మొత్తం ఎంతమంది పని చేస్తున్నారు :
వలస కార్మికుల సంఖ్య (వీలైతే) :

కంప్లైంట్లు ఎవరికి ఇవ్వాలంటే :
1. శ్రీ వి. టి. థామస్, రీజనల్ లేబర్ కమీషనర్, Mobile/ WhatsApp: 9496204401, email: [email protected], [email protected]
2. శ్రీ పి. లక్ష్మణ్, అసిస్టెంట్ కమిషనర్ లేబర్, Mobile/WhatsApp: 8328504888, email: [email protected]
3. శ్రీ ఏ. చాతుర్వేది, అసిస్టెంట్ కమిషనర్ లేబర్, Mobile/WhatsApp: 8552008109, email: [email protected].

Read more RELATED
Recommended to you

Latest news