నా జీవితానికి దొరికిన వరం.. అమ్మా నాన్నా అన్నీ నీవే

-

నా జీవితానికి దేవుడు ఇచ్చిన వరం తను. తనలో అమ్మ ప్రేమను, నాన్న స్పర్శను చూశా.

నాకు నా అనే వాళ్ళు లేని అనాధగా పెరిగాను. నా కోసమే దేవుడు అతన్ని పంపాడా అని అనిపిస్తుంది. అనుకోకుండా నా లైఫ్ లోకి వచ్చిన అతను నా లైఫ్ అంతా అతనే అయ్యాడు. వద్దనుకున్నా అతనితోనే నా జీవితం ప్రారంభ మైయ్యింది. నా కోసం తన వాళ్ళు అందరిని వదిలేసి వచ్చాడు. ఇక అప్పటి నుండి మేము ఒకరికి ఒకరుగా ఉన్నాం. అసలు నా పేరు చెప్పలేదు కదా. మా జర్నీ ఎక్కడ మొదలైందంటే…

నా పేరు చందన. తన పేరు ఫణి. నేను అనాధని. నేను పలానా అని చెప్పుకోవడానికి ఎటువంటి ఎఫెక్షన్స్ లేవు. అయినా దాతల సహకారం తో చదువుకుని బ్యాంక్ ఎగ్జామ్స్ కూడా రాసి ఎంపికయ్యాను. ఇంటర్వ్యూ లో సెలక్ట్ అయ్యాను. మంచి జాబ్ కూడా వచ్చింది. అక్కడ కలిశాడు తను. మంచి అందగాడు. ఇంటర్వ్యూలో తను కూడా సెలక్ట్ అయ్యాడు. కొలీగ్స్ అవటం వల్ల కొన్ని రోజులకు ఇద్దరికీ పరిచయమైనది. తనతో మాట్లాడిన తర్వాత నాకు తెలిసింది ఏమిటంటే తనకు జాబ్ చేయాల్సిన పని లేదు.

వాళ్ళు బాగా డబ్బు ఉన్న వాళ్ళు. కార్ ,రెండు, మూడు ఇళ్ళు, ఇంకా కొన్ని ప్రాపర్టీస్ కూడా ఉన్నాయి. కాక పోతే తను ఖాళి గా ఉండటం ఇష్టం లేక జాబ్ చేస్తున్నట్టు చెప్పాడు. దానితో తన ఆలోచనలు, మంచి ప్రవర్తన నాకు బాగా నచ్చాయి. ఆఫీస్ లో వర్క్ ఎక్కువగా ఉన్నప్పుడు హెల్ప్ చేసేవాడు. అలా మేము బాగా దగ్గర అయ్యాము. కొన్ని రోజులకు అతనే నాకు ప్రపోజ్ చేశాడు. కాని నేను నో చెప్పాను. కారణం అతను బాగా రిచ్ ఫ్యామిలి నుండి వచ్చిన వాడు. నేనేమో అనాథని.

అందుకే అతనికి నో చెప్పాను. నేను ఏ విధంగా కూడా అతనికి సరిపోనని వద్దన్నాను. కానీ ఒక రోజు ఫణి నా దగ్గరకు వచ్చి మా ఇంట్లో నాకు సంబంధాలు చూస్తున్నారు. కాని నాకు ఆ పెళ్లి ఇష్టం లేదు. నువ్వు నాకు కావాలి చందనా… అని హగ్ చేసుకుని ఏడ్చేశాడు. దానితో నేను తన ప్రేమ ని వదులుకోలేక ఓకే చెప్పాను. ఇక ఆ రోజు నుండి ఇద్దరం చాలా సంతోషం గా ఉన్నాము. ఆఫీస్ కి తనే ఎక్కించుకు వెళ్ళేవాడు, డ్రాప్ చేసేవాడు. ఒక రోజు ఇద్దరం గుడిలో పెళ్లి చేసుకున్నాం.

ఈ విషయం తెలుసుకుని అతని పేరెంట్స్ ఇంట్లో నుండి గెంటేశారు. ఆస్తిలో నీకు కొంచెం కూడా ఇవ్వమని అని చెప్పారు. నన్ను వదిలేస్తేనే తనని ఇంట్లోకి రానిస్తామని చెప్పారు. అయినా తను నన్ను వదిలేయలేదు. ఇక అప్పటి నుండే మా ప్రేమకి పరీక్ష మొదలైంది అని అనుకున్నాం. మా ఇద్దరి శాలరీ తో ఉన్నంతలో సంతోషంగా ఉన్నాము. ఒక రోజు నేను ఇంట్లో పని చేస్తుండగా స్టూల్ పై నుండి కింద పడ్డాను. దానితో నా తలకు దెబ్బ తగిలి స్పృహ కోల్పోయాను. అప్పుడు ఫణి నన్ను హాస్పిటల్ లో చేర్చి నన్ను కంటికి రెప్పలా చూసుకున్నాడు. నాకు అప్పుడు తెలిసింది తల్లి ప్రేమ. అనాధ లా పెరిగిన నా జీవితానికి దేవుడు ఇచ్చిన వరం తను. తనలో అమ్మ ప్రేమను, నాన్న స్పర్శను చూశా..

– ఫణి చందన

Read more RELATED
Recommended to you

Latest news