ప్రపంచ వ్యాప్తంగా చమురు ధరలు పడిపోతున్నా సరే మన దేశంలో మాత్రం ఇప్పుడు పెరగడం ఆందోళన కలిగిస్తుంది. చమురుకి డిమాండ్ లేక భారీగా తగ్గాయి ధరలు. ఉత్పత్తి కూడా అమాంతం పడిపోయిన పరిస్థితి ఏర్పడింది. ఈ తరుణంలో కేంద్ర సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది. పెట్రోల్, డీజిల్‌పై ఎక్సైజ్ సుంకాన్ని భారీగా పెంచుతూ నిర్ణయం తీసుకుంది. పెట్రోల్‌పై రూ.10, డీజిల్‌పై రూ.13 చొప్పున ఎక్సైజ్ సుంకం పెంచారు.
మంగళవారం అర్థ రాత్రి తర్వాత నుంచి ఈ పెంపు అమలులోకి వస్తుంది. అయితే ధరల్లో మాత్రం ఏ మార్పు ఉండదు అని ప్రభుత్వం పేర్కొంది. పెట్రోల్ బంకుల్లో పెట్రోల్, డీజిల్ ధరల్లో మార్పు ఉండదని స్పష్టం చేసింది. ప్రస్తుతం ఢిల్లీలో పెట్రోల్ రేటు రూ.71.26 ఉండగా… డీజిల్ రేటు రూ.69.39గా ఉంది.
ఆర్ధిక రాజధాని ముంబైలో పెట్రోల్ రేటు రూ.76.31 ఉండగా డీజిల్ రూ.66.21 ఉంది. హైదరాబాద్‌లో లీటరు పెట్రోల్ ధర రూ.73.97 గా ఉండగా… డీజిల్ ధర రూ.67.82గా ఉంది. అమరావతిలో పెట్రోల్ రేటు రూ.74.61గా ఉంది. డీజిల్ రేటు రూ.68.52గా ఉంది. విజయవాడలో పెట్రోల్ రేటు రూ.74.21ఉండగా… డీజిల్ రూ.68.15 ఉంది. దేశవ్యాప్తంగా పెట్రోల్, డీజిల్ ధరల్లో ఎలాంటి పెంపూ లేదు.