24 కిస్సెస్ ట్రైలర్.. లవ్ అండ్ ఎమోషన్

-

సుకుమార్ నిర్మించిన కుమారి 21 ఎఫ్ సినిమాతో హెబ్భా పటేల్ ఓవర్ నైట్ స్టార్ హీరోయిన్ గా అవతరించింది. ఆ సినిమాతో అమ్మడికి వచ్చిన హాట్ ఇమేజ్ ఆ తర్వాత వాడుకోలేదని చెప్పాలి. సినిమాలో హెబ్భా పటేల్ ఉంది అంటే కనీసం ఒక్క లిప్ లాక్ అయినా ఆశించే ఆడియెన్స్ ఉన్నారు. ఇన్నాళ్లు కెరియర్ కాస్త చప్పగా సాగించిన హెబ్భా మరోసారి కుమారి 21ఎఫ్ లాంటి సబ్జెక్ట్ తో మళ్లీ ప్రేక్షకుల ముందుకు వస్తుంది.

ఆదిత్ అరుణ్ హీరోగా అయోధ్యా కుమార్ డైరక్షన్ లో వస్తున్న సినిమా 24 కిస్సెస్. టీజర్ తోనే సినిమా ఎలా ఉంటుందో చూపించిన దర్శకుడు ట్రైలర్ తో సినిమాపై అంచనాలు పెంచాడు. ట్రైలర్ లో ఓ పక్క లీడ్ పెయిర్ రొమాన్స్ తో పాటుగా ఎమోషన్స్ కూడా ఆకట్టుకున్నాయి. ప్లే బోయ్ అయిన హీరో సిన్సియర్ గా ప్రేమించిన హీరోయిన్ తో ఎలాంటి ఇబ్బందులు పడ్డాడు అన్నది సినిమా కథ.

ట్రైలర్ చూస్తే సినిమా కచ్చితంగా యూత్ ఆడియెన్స్ ను అలరించే అన్ని అంశాలు ఉన్నాయని చెప్పొచ్చు. నవంబర్ 15న రిలీజ్ అవుతున్న ఈ సినిమాతో హెబ్భా మళ్లీ ఫాంలోకి రావాలని చూస్తుంది. మరి అమ్మడు కోరుకునే సూపర్ హిట్ 24 కిస్సెస్ అవుతుందా లేదా అన్నది సినిమా వస్తేనే కాని చెప్పగలం.

Read more RELATED
Recommended to you

Latest news