బంతి పూల సాగులో రైతులు వీటిని తప్పక పాటించాలి..

-

మన దేశంలో ఎక్కువగా పండించే పూలల్లో బంతి పూలు కూడా ఒకటి..ఈ పంటను తెలుగు రాష్ట్రాలలో పండిస్తున్నారు.శీతాకాలంలో బంతికి ఎక్కువ డిమాండ్ ఉంది.ఆకర్షణీయమైన రంగుల్లో ఎక్కువ కాలం పాటు నిల్వవుండే రకాలు ప్రస్తుతం రైతులు సాగు చేస్తున్నారు. సన్న చిన్నకారు రైతులు తమకున్న కొద్ది పాటి పంటపొలాల్లో బంతిపూల సాగు వల్ల మంచి ఆదాయాన్ని కూడా పొందవచ్చు..

బంతిని అన్నీ రకాల నేలల్లో పండించవచ్చు..అయితే సారవంతమైన గరపనేలలు అత్యంత అనుకూలంగా ఉంటాయి. మురుగు నీటి వసతి ఉన్నచో బరువైన నేలల్లో కూడా బంతిని సాగు చేయవచ్చు . ఉష్ణోగ్రతల ప్రభావం పూల సాగుపై ఉంటుంది. ఉష్ణోగ్రతలు ఎక్కువున్నా పూలపై తీవ్ర ప్రభావం చూపుతుంది . నీడ ప్రదేశాలను బంతి సాగుకు అనుకూలం కాదు..కాస్త వెలుతురు ఉండటం తప్పనిసరి..

ఆఫ్రికన్ బంతి రకాలకు గిరాకీ ఎక్కువ . ఇవి ప్రదానంగా పసుపు , నారింజ రంగులతో ముద్దగా ఉండే పూలు నిస్తాయి. వీటికి మార్కెట్ విలువ ఎక్కువ . ఈ మొక్కలు ఎత్తుగా , బాగా పెరిగి పెద్ద పూలనిచ్చే రకాలు. పూసా నారింగ గైండా , పూసా బసంతి గైండా , అర్కా బంగార , మరియు అర్కా అగ్ని , అర్కా బంగార -2 రకాలను సాగు చేయటం ద్వారా మంచి దిగబడిని పొందవచ్చు. అయితే ఇవి కాండం కత్తిరింపుల ద్వారా మాత్రమే వ్యాప్తి చేసుకోవచ్చు..వీటిలో గింజలు వుండవు..అర్క జాతి మంచి దిగుబడిని ఇస్తుంది..

వర్షాకాలంలో బంతిపూల సాగులో కలుపు బెడదా అధికంగా ఉంటుంది . పంట కాలంలో 3-4 సార్లు కూలీల సహాయంతో కలుపును తీయించాలీ. కలుపు నివారించక పోతే బంతి మొక్కలలో పోషకాలు నీటికోసం పోటీపడి బంతి పూల దిగబడిని , నాణ్యతను తగ్గిసాయి. సాధారణంగా బంతి మొక్కలు ఒక ప్రధానకారణంతో ఏపుగా పెరుగుతాయి .ఆ తరువాత శాఖలు ఏర్పడతాయి . అందువల్ల మొక్కలు నాటిన 10 రోజులకు తలలు తుంచడం వల్ల ప్రధాన కాండం పెరుగుదల ఆగిపోయి , పక్క నుంచి కొత్త మొక్కలు పెరుగుతాయి.

ఆఫ్రికన్ రకాలు ఎకరానికి 4-5టన్నులు హైబ్రిడ్ రకాలు 6-8 టన్నులు పూల దిగుబడినిస్తాయి. మార్కెంట్ డిమండ్ ఆధారంగా బంతిని సాగుచేసి రైతులు అధిక ఆదాయాన్ని పొందవచ్చు . పొలంలో నాటుకొన్న రెండు నెలల తర్వాత నుంచి పూల దిగుబడి మొదలవుతుంది. మొదటి కోత నుంచి మంచి రెండు లేదా రెండున్నర నెలల వరకు పూత వస్తుంది. పువ్వులు విచ్చుకున్న తరువాత ఉదయం లేదా సాయంతం వేళల్లో కోయడం మంచిది..పూలను 3 లేదా 4 రోజులకు ఒకసారి కొయ్యాలి..ఎక్కువ రోజులు నిల్వ ఉంటాయి..

Read more RELATED
Recommended to you

Latest news