రబీలో పండించే పంటలో శనగను రైతులు ఎక్కువగా పండిస్తారు. తెలుగు రాష్ట్రాల్లో చాలా ప్రాంతాల్లో దీన్ని సాగుచేస్తారు. అధికదిగుబడి రావడంతో ఇటీవలి కాలంలో ఈ పంటకు డిమాండ్ బానే పెరిగింది. నల్లరేగడి నేలలు ఈ పంటకు అనుకూలం. నల్లరేగడి నెలల్లో నిలువ ఉండే తేమను ఉపయోగించుకుంటూ శీతకాలంలో మంచుతో మెక్కలు పెరుగుతాయి. అయితే ఏ పంటలో అయినా తెగుళ్లు రావడం సహజం. ఈరోజు మనం శనగ పంటలో ఎలాంటి రకలా తెగుళ్లు వస్తాయి. వాటి నివారణకు ఎలాంటి మందులు వాడాలో చూద్దాం.
శనగలో వచ్చే తెగుళ్లు
ఎండు తెగులు: ఈ తెగులు సోకిన మెక్కలు తొలి దశలోనే తర్వగా చనిపోతాయి. కొంచెం పెరిగిన మొక్కల్లో ఆకులు వడలిపోయి ఆలస్యంగా చనిపోతాయి. ఐ.సి.సి.సి.-37 ,ఐ.సి.సి.వి-2 ,ఐ.సి.సి.వి-10 రకాలను వరుసగా 3-4 సం.లు ఒకే పొలంలో విత్తుకోకుడదు. పంట మార్పిడి, విత్తనశుద్ది చేయాల్సి ఉంటుంది.
నివారణకు
ఎండు తెగులు , వేరుకుళ్ళు తెగులు , మొదలు కుళ్లు తెగులు నివారణకు 2.5 గ్రాముల కార్బండిజిమ్ లేదా విటావాక్స్ పవర్ 1.5గ్రాములు లేదా 1.5గ్రాముల టెబుకోనజోల్ కిలో విత్తనానికి కలిపి విత్తుకోవాలి. తరువాత విత్తనానికి ట్రైకోడర్మావిరిడి పొడి మందును 8 నుండి 10గ్రాముల కలిపి విత్తుకోవడం వలన ఈ శిలీంధ్రం భూమిలో బాగా వ్యాప్తి చెంది తెగుళ్ళ బారి నుండి పంటను రక్షిస్తుందని నిపుణులు అంటున్నారు..
శనగపచ్చ పురుగు : ఇది లద్దే పురుగు దశలో పూతను ,కాయలను తింటుంది.. సీతాకోక చిలక దశలో పూత పైన, కాయలపైన గుడ్లును ఒక్కోకటిగా పెడుతుంది . గుడ్ల నుండి వచ్చిన పురుగు కాయలను తొలిచి గింజలను తింటుంది.
నివారణకు
లీటరు నీటికి ఎండోసల్ఫాన్ 2.౦ మి.లీ. లేక క్వినాల్ ఫాస్ 2.0 మి.లీ. లేదా ఎసిఫేట్ 1.0గ్రా .చొప్పున పూత ,పిందె దశల్లో 10 రోజుల వ్యవధిలో మందులను మర్చి రెండు ,మూడు సార్లు పిచికారి చేయాలి. శనగతో అంతరపంటలుగా ఆవాలు వేసుకోవాలి.