మల్లెపూల సాగులో పాటించాల్సిన మెళకువలు..!!

-

తెలుగు రాష్ట్రాల్లో ఎక్కువగా పండించె పంటల లో మల్లె కూడా ఒకటి..గుండు మల్లెను ఎక్కువ విస్తీర్ణంలోను, జాజిమల్లె, సనను తక్కువ విస్తీర్ణంలో సాగు చేస్తున్నారు. గుండుమల్లె, జాజిమల్లి సువాసనలను వెదజల్లుతాయి. ఈ పూలలో బెంజైల్ ఎసిఫేట్, బెంజైల్ బెంజోయేట్, యూజినాల్, టెర్పనాల్, బెంజాల్డిహైడ్, ఇండోల్ కాంపౌండ్స్, జాస్మిన్, మిథైల్ జాస్మొనేట్ ఉన్నందున పూలకు సువాసనను సంతరించుకున్నాయి.గుండుమల్లె మార్చి నుంచి సెప్టెంబరు వరకు, జాజిమల్లె మార్చి నుంచి నవంబరు వరకు పూల దిగుబడినిస్తాయి. అయితే ఈ మధ్యకా లంలో కొన్ని ప్రాంతాల్లో తమిళనాడురాష్ట్రంలోని మధురై, రామేశ్వరం ప్రాంతాల నుంచి రామనాథపురం అనే గుండుమలై పిలకలను సేకరించి సాగు చేస్తూ పూల దిగుబడి పొడిగించగలుగుతున్నారు..

ఈ నెల నుంచి తోటకు నీళ్ళు పెట్టకుండా ఆకులను వాడ బెట్టాలి.ఇక కొమ్మలన్నింటిని దగ్గరకు చేర్చి తాడులో కడితే ఆకులు తొందరగా రాలుతాయి.ఆకులు రాలకుంటే కూలీలతో దూయించాలి. ఇది చాలా ఖర్చుతో కూడుకున్న పని.తోటలో గొర్రెల మందను లేదా మేకలమందును వదిలితే ఆకులన్నిటిని తినేస్తాయి.ఆకుల్ని రసాయనాలు పిచికారి చేసి కూడ రాలేటట్లు చేయవచ్చు. లీటరు నీటికి 3 గ్రా. పెంటాక్లోరోఫి నాల్ లేదా పొటాషియం అయొడైడ్ను కలిపి మొక్కలపై పిచికారి చేస్తే ఆకులన్ని రాలి ఎక్కువ పూల దిగుబడి పొందే అవకాశం ఉంటుంది..

మల్లెలో కొమ్మ కత్తిరింపు చాలా ముఖ్యమైనది..కొత్త రెమ్మల చివరి భాగంలోను, పక్కల నుంచి పూత పుడుతుంది. కాబట్టి పూలు పూసే కొమ్మలు, రెమ్మలను ఎక్కువ సంఖ్యలో పొందటానికి తద్వారా అధిక పూల దిగుబడి పొందేందుకు కత్తిరింపులు చేయాలి. కత్తిరింపులు మొక్క పెరుగుదల, మొగ్గలు ఏర్పడడం, పూల దిగుబడి, నాణ్యతలపై ప్రభావం చూపుతాయి.జనవరి మొదటి పక్షంలో 5 సంవత్సరాల్లోపు వయస్సున్న తోటల్లో తీగలను భూమి నుంచి రెండు అడుగులు, 5 సంవత్సరాలపైన వయస్సున్న తోటల్లో మూడు అడుగులు ఉంచి మిగిలిన పైభాగాన్ని కత్తిరించాలి.వీటితోపాటు ఎండిన, బలహీనంగా ఉన్న కొమ్మల్ని, నీరు పారించిన తరువాత పుట్టుకొచ్చే నీటి కొమ్మల్ని పూర్తిగా కత్తిరించి తొలగించాలి..

ఇకపోతే పూలు కోయడం అయిన తరువాత 7-10 రోజులు నీరు పెట్టకుండా మొక్కలు కొంచెం వాడే టట్లు చేసి ఆ తరువాత నీరు పెడితే పూలదిగుబడి అధికంగా ఉంటుంది.పూత పూసే సమయంలో మొక్కలు నీటి ఎద్దడికి గురికాకూడదు..ఐదు రోజులకొకసారి నీళ్ళను ఇవ్వడం మంచిది.నత్రజనిని ఎక్కువగా వేస్తే శాఖీయ పెరుగుదల ఎక్కువ కావడం, పూలకాడ సన్నగా, పొడవుగా పెరగడం, పూలు త్వరగా చెడిపోవడం, దిగుబడి తగ్గడం లాంటి ఇబ్బందులు గుల ఎదురవుతాయి.చెట్టు చుట్టూ గాడిచేసి, గాడిలో ఎరువులు వేసి గాడిని మట్టితో మూయాలి. ఇలా చేస్తే వేసే పోషకాలు చెట్లకు అందుతాయి..ఇప్పుడు సీజన్ కాబట్టి వీటికి మంచి డిమాండ్ కూడా ఉంది.. ఇంకేదైనా సమాచారం కావాలంటే వ్యవసాయ నిపునులను సంప్రదించగలరు..

Read more RELATED
Recommended to you

Latest news