మేకలని కొనాలనుకుంటున్నారా..? ఈ మేకలకు డిమాండ్ ఎక్కువట..!

-

చాలా మంది రైతులు వ్యవసాయం చేసుకుంటూ ఆవులను, గేదెలను లేదా మేకలను పెంచుతూ ఉంటారు. మేకలని పేద మనిషి ఆవు అని అంటారు. భారతదేశంలో మేకల పెంపకం బాగా స్థిరపడిన ప్రాచీన వ్యవసాయం అని చెప్పచ్చు. మేక పెంపకం వల్ల చాలా ప్రయోజనాలు ఉన్నాయి.

మటన్ కి డిమాండ్ ఎంత ఉందో ప్రత్యేకించి చెప్పక్కర్లేదు. పైగా మతపరమైన నిషేధం కూడా లేదు. పైగా మేక మాంసం తక్కువ కొలెస్ట్రాల్ కలిగి ఉంటుంది. మేకల పెంపకానికి బ్యాంకులు కూడా రుణాలు ఇస్తూ ఉంటాయి. అయితే మీరు కూడా మేకల్ని పెంచాలనుకుంటున్నారా..? ఎక్కువ డిమాండ్ ఉన్న మేకల గురించి ఇప్పుడు చూద్దాం.

జమునపారి మేకలు:

ఎక్కువగా ఇవి ఉత్తర ప్రదేశ్‌లో ఉంటాయి. ఇవి పొడుగ్గా ఉంటాయి. మగ మేక 65 కిలోల నుండి 80 కిలోల బరువు మరియు ఆడ మేక బరువు 45 కిలోల నుండి 60 కిలోల మధ్య ఉంటుంది. వీటికి చాలా డిమాండ్ వుంది.

తెల్లిచేరి మేక:

వీటికి కూడా చాలా డిమాండ్ వుంది. కేరళలో ఇవి ఎక్కువగా కనపడుతూ ఉంటాయి. మగ మేక 40 -50 కిలోల మధ్య ఉండగా, ఆడ మేక 30 – 40 కిలోల మధ్య ఉంటుంది.

మలబరి మేక:

ఇవి కూడా కేరళలో ఉంటాయి. వీటికి కూడా బాగా డిమాండ్ వుంది. ఈ మేక నాణ్యమైన చర్మం కలిగి ఉంటుంది.

బార్బరి మేక:

ఈ మేకలు ఎక్కువగా ఢిల్లీ ఉత్తర ప్రదేశ్, హర్యానా వంటి రాష్ట్రాల్లో కనపడతాయి. వీటికి కూడా బాగా డిమాండ్ వుంది. మగ మేక 35-45 కిలోల మధ్య ఉంటుంది మరియు ఆడ మేక బరువు 25- 35 కిలోలు దాక ఉంటుంది.

అలానే బీటల్ మేక, ఉస్మానాబాది మేక, కన్నీ ఆడు మేక, కోడి ఆడు మేక వంటి మేకలకు డిమాండ్ బాగా ఎక్కువగా వుంది. ఒకవేళ మీ ఊళ్ళల్లో ఇవి దొరక్కపోతే అప్పుడు మీరు ఎక్కువ మంది పెంచే వాటిని, మీ పరిసర ప్రాంతాల్లో డిమాండ్ ఉన్న వాటిని ఎంపిక చేసుకోండి.

 

 

Read more RELATED
Recommended to you

Latest news