వరిసాగులో కలుపు నివారణకు రైతులు తీసుకోవాల్సిన జాగ్రత్తలు..

-

మన దేశంలో అధిక శాతం దిగుబడిని ఇచ్చే పంటలలో వరి కూడా ఒకటి..వరిలో కలుపు సమస్య కూడా ఎక్కువగా ఉంటుంది..అందుకే వరిలో కలుపు సమస్య కాస్త ఎక్కువగానే ఉంటుంది.అయితే ఈ కలుపు నివారణకు ఏం చెయ్యాలి అనేది ఇప్పుడు తెలుసుకుందాం…

 

వరి నారు మడిలో కలుపు నివారించేందుకు బ్యూటిక్లోర్ 50 ఎం.ఎల్ మందును ఎకరాకు 5 లీటర్ల నీటిలో కలిపి పిచికారి చేయాలి. బిన్ పైరిబాక్ సోడియం అనే కలుపు మందును 0.5 ఎం.ఎల్ మందును ఒక లీటరు నీటికి కలిపి విత్తిన 10 రోజులకు వేసుకోవాలి. నాటిన వరి పొలంలో కలుపు యాజమాన్యం కోసం బ్యూటిక్లోర్ లీటరు మందును 200 లీటర్ల నీటిని కలిపి పిచికారి చేయాలి. సైహలోవాప్ పిబ్యూటైల్ 300 ఎం.ఎల్ మందు ఎకరానికి పిచికారి చేసుకోవాలి..

ఇకపోతే నాటిన వా రంరోజుల్లోపు ఎకరానికి లీటరు బుటాక్లోర్‌, అనిలోఫాస్‌, ప్రటిలాక్టేర్‌లలో ఏదో ఒక రసాయానాన్ని పొడి ఇసుకలో కలిపి పొలంలో చల్లుకోవాలి. వరి నాటిన 30రోజుల్లో కలుపు నివారణకు ఎకరానికి 400 గ్రాముల 2, 4డి సోడియం సాల్డ్‌ లేదా 50 గ్రా ముల ఇథాక్సిసల్ఫ్యురాన్‌ పొడిని పిలిచికారి చేయాలి. అయితే సాగు చేసిన పంటలో మొలకెత్తిన కలుపును బట్టి రైతులు వ్యవసాయ నిపుణు ల సూచనల మేరకు రసాయనాలను వాడితే ఉత్తమ ఫలితాలు వుంటాయి.

ఎదపద్ధతిలో చేపట్టిన వరి సాగులో విత్తనాన్ని 48 గంటల నానబెట్టి మొలక కట్టిన వరి విత్తనాన్ని రైతులు నాటటానికి వినియోగిస్తారు. విత్తనం విత్తిన తరువాత ప్రిటిలాక్లోర్ సెఫనర్ మందును ఎకరాకు 600 మి.లీ నుండి 800 మి.లీ వరకు విత్తిన 5 రోజుల లోపు వాడుకోవాలి. పైరజో సల్య్ఫురాన్ ఈథైల్ అను కలుపు మందును ఎకరాకు 80 నుండి 100 గ్రాములు విత్తిన 8 నుండి 10 రోజుల లోపు వాడాలి. ఇది గడ్డి జాతి కలుపును నివారిస్తుంది.ఈ పధ్ధతి ద్వారా కలుపు సమస్య కొంత వరకూ తగ్గుతుంది..ఇది విత్తిన 10 రోజుల లోపు వాడాలి..

నేలలు, వాతావరణం, సాగుచే సిన పంటలను బట్టి కలుపు మందులు వాడుకోవాలి. కలుపు మొక్కల్లో ఏక వార్షిక, బహు వార్షిక రకాలుంటాయి. గనుగు, ఉత్తరేణి, అడవి తుల సి, తోటకూర వంటివి ఏకవార్షిక కలుపు మొక్క లు. అంటే ఏడాదిలో ఓకే సారి మొలుస్తాయి.తుంగ వంటి వాటిని నాశనం చెయ్యాలంటే గ్లెఫోసేట్‌ రసాయనం సమర్థంగా పని చేస్తుంది..వరిలో వచ్చే సమస్యల గురించి మరింత సమాచారం కొరకు దగ్గరలొని వ్యవసాయ నిపునులను సంప్రదించాలి..

Read more RELATED
Recommended to you

Latest news