మేకలలో వచ్చే తామర వ్యాధిని ఎలా నివారించాలి..?

-

మేకలకు ఎంత జాగ్రత్తలు తీసుకున్నా కూడా ఏదొక వ్యాధులు వస్తూనే ఉంటాయి. డెర్మటోఫైట్స్ అనే రకానికి చెందిన శీలింధ్రాల వలన కలుగుతుంది.చర్మపు ఉపరితలంను నాశనం చేయడం వలన, చర్మంపైన గుండ్రటి గోళాకారపు లీషన్స్ ఏర్పడుతుంటాయి. అందువలన ఈ వ్యాధిని రింగ్ వార్మ్ ఇన్ఫెక్షన్ అని కూడా అంటారు.ఆవులు, గేదెలు, మేకలు, గొర్రెలు, పందులు, గుర్రాలు, కుక్కలు, పిల్లులు మరియు మనుషులు..

అధిక పశువులను ఒక చోట కట్టివేయుట ద్వారా ఈ వ్యాధి అంటు వ్యాధి వలే ఒక పశువు నుండి మరోక పశువుకు వ్యాపిస్తుంటుంది. ఆరోగ్యవంతమైన పశువుల శరీరం పైన కూడా ఈ శీలిం ధ్రాలుండి ఇతర పశువులకు వ్యాపిస్తుంటుంది.ముఖ్యంగా ఈ శీలింధ్రాలు ప్రధానంగా చర్మం, వెంట్రుకలు, గోర్లు మీద పెరిగి వాటిని నాశనం చేయుట వలన అధికంగా వెంట్రుకలు ఊడిపొయి లీషన్స్ తయారవుతుంటాయి. ఇవి రింగు వలే లీషన్స్ను ఏర్పరుచుట వలన ఈ వ్యాధిని రింగ్ వార్మ్ ఇన్ఫెక్షన్ అని కూడా అంటారు..

ఈ వ్యాధి లక్షణాల విషయానికొస్తే..చర్మం పైన వెంట్రుకలు రాలిపోతుంటాయి. లీషన్స్ ఉన్న ప్రదేశం రింగ్ వలే ఉంటుంది. కంటి చుట్టు, చెవులపైన, మెడపైన, తలపైన ఎర్రటి పుండ్లు ఏర్పడి ఉంటాయి. చర్మం పైన గాయాలు గుండ్రంగా గోళాకారంలో ఉంటాయి. గాయం మధ్యలో మానిపోయి చుట్టూ పచ్చిగా పొక్కుగట్టి ఉంటుంది..

వ్యాధి నివారణ:

వ్యాధి చరిత్ర ఆధారంగా, వ్యాధి లక్షణాల ఆధారంగా, వ్యాధి కారక చిహ్నముల ఆధారంగా మరియు ప్రయోగశాల పరీక్షల ఆధారంగా – చర్మపు లీషన్స్ తీసుకొని 10 శాతం పొటాషియం హైడ్రాక్సైడ్ ద్రావణంలో ముంచి, ఒక స్లైడ్ పై వేసి సూక్ష్మదర్శినిలో గమనించినట్లైతే శీలింధ్రాల హైపే, సిద్ధబీజాలు కనిపిస్తాయి.సహజంగా ఈ వ్యాధి ఒకటి నుండి మూడు నెలలలోపు దానంతటకు అదే తగ్గిపోతుంది. లేదంటే ఎదీని ఈ క్రింది ఆయింట్మెంట్ ను చర్మపు లీషన్స్ పై ఉపయోగించిన యెడల ఫలితం ఉంటుంది.

5 -10 % Salicylic Acid, 4.6 % benzoic Acid, 2-5% lodine, 4-5% phenol, Clotrimazole ointments వంటివి చర్మంపైన పూతగా వాడాలి.సిస్టమిక్ ఇన్ఫెక్షన్ అయినట్లైతే ఈ క్రింది ఔషదములను ఇవ్వవచ్చు.Griseofulvin కి.లో శరీర బరువుకు 10-20 mg చొప్పున 15-30 రోజులు వాడాల్సి ఉంటుంది. ketoconazole కి.

శరీర బరువుకు 8-10 mg చొప్పున నోటి ద్వారా 30 నుండి 50 రోజులు వాడాలి. వ్యాధి సోకిన పశువులను మంద నుండి వేరుచేసి, వీలైనంత త్వరగా చికిత్స ప్రారంభించాలి. పశువుల పాకలో వ్యాధిగ్రస్త పశువుకు ఉపయోగించే వస్తువులను వేరుగా ఉంచాలి..ఈ కారకాలు వేరే వాటికి వ్యాప్తించకుండా తగు జాగ్రత్తలు తీసుకోవాలి.. దగ్గరలోని పశు వైద్యులను సంప్రదించండి..

Read more RELATED
Recommended to you

Latest news