అన్నదాతలకు గమనిక.. ఈ ప్రభుత్వ సబ్సిడీని వదలకండి..!

చాలా మంది వ్యవసాయం చేస్తూ జీవిస్తున్నారు. నేటికీ దేశంలోని అధిక జనాభా వ్యవసాయాన్ని నమ్ముకున్నారు. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల వాళ్ళు వ్యయసాయం పైన ఆధారపడి వున్నారు. అయితే రైతుల కోసం కేంద్ర ప్రభుత్వం వివిధ రాష్ట్ర ప్రభుత్వాలు కూడా వారి కోసం ప్రత్యేకంగా స్కీమ్స్ ని తీసుకు రావడం.. సాయం చేయడం తెలిసిందే. ఈ పథకాల ద్వారా రైతులకు తక్కువ ధరకు ఎరువులు, పనిముట్లు వంటివి వస్తాయి.

farmers

అలానే ఆర్ధిక సాయం కూడా అందుతుంది. ఇక ఇది ఇలా ఉంటే దేశంలో సాగు చేస్తున్న ఏ రైతు అయినా స్మామ్‌ యోజన పథకాన్ని సద్వినియోగం చేసుకోచ్చు. మరి ఇక దీని కోసం పూర్తి వివరాల లోకి వెళితే.. ఈ స్కీమ్ కి మహిళా రైతులు కూడా దరఖాస్తు చేసుకోచ్చు. దీని కింద వ్యవసాయానికి ఉపయోగించే ఆధునిక పరికరాల ధరపై మార్కెట్ రేటులో దాదాపు 50 నుంచి 80 శాతం సబ్సిడీ ఇస్తుంది.అయితే అధిక దిగుబడి కోసం వ్యవసాయంలో ఆధునిక పరికరాలను ఉపయోగించమని ప్రభుత్వం అన్నదాతులని సపోర్ట్ చేస్తోంది. పేద రైతులు కూడా ఈ వ్యవసాయ వస్తువులను కొనుగోలు చేసి వాడుకోచ్చు. వీటిపై ఇప్పుడు సబ్సిడీ ఇస్తోంది.

ఈ పధకం ద్వారా బెనిఫిట్స్ పొందాలి అంటే ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి. దీని వల్ల రైతులు వ్యవసాయ పరికరాలు కొనుగోలు చేసుకోచ్చు. రిజర్వ్ చేయబడిన వర్గం ఈ పథకం గరిష్ట ప్రయోజనాన్ని పొందుతుంది. కేంద్ర ప్రభుత్వ సహకారంతో వ్యవసాయ పరికరాలపై దాదాపు 50 నుంచి 80 శాతం వరకు రాయితీ పొందొచ్చు.