పశువులలో సాల్మోనెల్లా వ్యాధి లక్షణాలు,నివారణ చర్యలు..

-

వర్షాకాలంలో పశువులకు ఎన్నో రకాల సమస్యలు వస్తాయి..అయితే కొన్ని రకాల వ్యాధులను ముందే పసిగట్టి వాటి నివారణ చర్యలను తీసుకోవడం చాలా మంచిది.సాల్మోనెల్లా జాతికి చెందిన దాదాపు 1000 రకాల కర్ర ఆకారపు దూమ్ర వర్ణపు సూక్ష్మజీవి సంపర్కం వలన ఆవులు, మేకలు, గొర్రెలు, కుక్కలు, పక్షులు మరియు మనుషులలో ఆకస్మికంగా లేదా దీర్ఘకాలంగా కలిగే ప్రాణాంతకమైన ఒక జునోటిక్ వ్యాధి..ప్రపంచం లోని అన్ని ఉష్ణ మండలాలతో సహ మన దేశంలోని అన్ని ప్రాంతాలలో ఈ వ్యాధి వ్యాప్తిని గుర్తించినారు.ఈ వ్యాధి వ్యాప్తి అధికంగా ఉన్నప్పుడు ఆకస్మికంగా వాంతులు, విరోచనాలు వంటి ముఖ్య లక్షణాలుండి పశువులు మరణిస్తూంటాయి.. నెగిటివ్ బ్యాక్టీరియా, కర్ర ఆకారంలో ఉండి, చలనం కలిగి యుంటాయి. ప్యాకల్టెటివ్ ఎనరోబిక్ గుణం కూడా వీటికి కలదు. ఈ బ్యాక్టీరియాలు సాధారణంగా ప్రేగులలో జీవిస్తూ, అనుకూల పరిస్థితులు ఏర్పడినప్పుడు వ్యాధిని కలుగజేస్తుంటాయి..ఇది ప్రాణంతకరమైన వ్యాధి..

వ్యాధి కారకాలు:

బ్యాక్టీరియాలతో కలుషితమైన ఆహారం, నీరు తీసుకోవడం ద్వారా ఈ వ్యాధి ఆరోగ్యంగా ఉన్న పశువులకు వ్యాపిస్తుంటుంది. అన్ని కాలాలలో ఈ వ్యాధి ప్రబలినప్పటికి, వర్షాకాలంలో వ్యాధి తీవ్రత ఎక్కువగా ఉంటుంది..కలుషితమైన ఆహారం, నీరు తీసుకోవడం ద్వారా ఈ క్రిములు పొట్టలోనికి చేరి, అక్కడ నుండి ప్రేగులలోకి, తద్వారా రక్తంలోకి చేరి, సెప్టిసీమియాగా మారి, కాలేయం, ఉపిరితిత్తులు, ప్లీహం, మెనింజస్, పెరిటోనియం మరియు మూత్ర పిండాలలోకి చేరతాయి..

వ్యాధి లక్షణాలు:

*. శ్వాస పీల్చుకోవడంలో ఇబ్బందులు ఉంటాయి.
*. నాడీ మరియు గుండె వేగం పెరిగి యుండును.
*. జ్వరం తీవ్రత ఎక్కువగా వుండును.
*. రూమినల్ మోటిలిటి అధికంగా వుండును.
*. కడుపు నొప్పితో కూడిన విరోచనాలు ఈ వ్యాధి ప్రత్యేకత.

*. ఈ వ్యాధి బారిన పడిన పశువులు నీరసంగా ఉండి సరిగ్గా నడవలేవు. ఆహారం కూడా సరిగ్గా తీసుకోవు..

*. విరోచనాలు అధికంగా కలుగుట వలన పశువులు నీరసంగా, కళ్ళు లోపలికి గుంతలు పడి, చర్మం ముడతలు పడి, మొద్దు బారి ఉంటుంది..
ఈ వ్యాధి వచ్చినప్పుడు రక్త స్రావము ప్రతి అవయవాలనుంచి వస్తుంది.కాలేయ కణాలు విచ్చిన్నం అయ్యి సాల్మోనెల్లోసిస్ నాడ్యుల్సును కలిగి యుండుటను గమనించవచ్చును..

వ్యాధిని ఎలా గుర్తించాలి..

వ్యాధి చరిత్ర, వ్యాధి లక్షణాలు, వ్యాధి కారక చిహ్నముల ఆధారంగా మరియు ప్రయోగశాల పరీక్షల ద్వారా ఈ వ్యాధిని నిర్ధారించవచ్చును. ప్లేట్ ఆగ్లూటినేషన్ పరీక్ష ద్వారా ఈ వ్యాధిని సులభంగా నిర్ధారించవచ్చు..
జ్వరం తగ్గడానికి ఆంటి పైరెటిక్ ఔషధములను, డయేరియా తగ్గడానికి ఆస్ట్రింజెంట్స్ను, ఇన్ఫ్లమేషన్ తగ్గడానికి ఆంటి ఇన్ఫ్లమేటరి ఔషదములను ఇవ్వాలి..ఈ వ్యాధి లక్షణాలు ఉన్న పశువులు నోటి ద్వారా ఆహారాన్ని తీసుకోలేవు..వాటికి సెలైన్ ద్రావణాలు, విటమిన్స్ మరియు మినరల్స్ ఇంజక్షన్లు ఇవ్వవలెను. సులభంగా జీర్ణం అయ్యే ఆహారంను ఇవ్వాలి. తగినంత విశ్రాంతి చాలా అవసరం..

వ్యాధి నివారణ:

1.ఈ వ్యాధికి టీకా లేదు.
2. వ్యాధి సోకిన వాటిని మంద నుండి వేరుచేయాలి.
3. కలుషితం అయిన ఆహారం మరియు నీరు అందించరాదు.
4. మంచి పోషక విలువలు కలిగిన ఆహారాన్ని అందించాలి..
ఇలా చెయ్యడం వల్ల వ్యాధిని అరికట్టవచ్చు..పశువులను కాపాడుకోవచ్చు..

Read more RELATED
Recommended to you

Latest news