యాలుకలతో చర్మం పై ముడతల సమస్యకు చెక్ పెట్టేయొచ్చట..!

మసాల దినుసుల్లో.. యూలకులు చాలా ముఖ్యమైనవి. అందరి ఇళ్లల్లో యూలకలు కచ్చితంగా ఉంటాయి. వంటలో మంచి రుచితో పాటు మంచి వాసనను కూడా ఇస్తాయి. యాలుకలతో చర్మ సౌందర్యాన్ని పెంపొందించడంలో కూడా బాగా ఉపయోగపడుతుంది. చర్మ సౌందర్యం కోసం.. బయట వాడే క్రీమ్స్ కంటే..ఇంట్లో ఉండే వాటితో చేసే చిట్కాలతోనే మంచి ఫలితం ఉంటుంది. వీటివల్ల సైడ్ ఎఫెక్ట్స్ కూడా ఉండవు. రకరకాల సమస్యలకు హోమ్ రెమెడీస్ చక్కగా పనిచేస్తాయి. ముడతల సమస్యలు నేడు చాలామందిని ఇబ్బందిపెడుతున్నాయి. వీటికోసం.. ఏవేవో ట్రే చేస్తుంటారు. యాలుకలతో ఈ సమస్యకు చెక్ పెట్టేయొచ్చు. ఇందులో ఉండే యాక్సిడెంట్లు చర్మంపై అలర్జీలు రాకుండా చేస్తాయి. చర్మాన్ని కాంతి వంతంగా మెరిసేలా చేస్తాయి. యాలకులు రక్త ప్రసరణను మెరుగుపరుస్తాయి. చర్మంలోని టాక్సిన్స్ ను బయటకుపంపుతాయి. ఈరోజు ఇంకా.. యాలుకలతో ఎలాంటి ఉపయోగాలు ఉన్నాయి.. ఎలా వాడుకోవాలో చూద్దామా..!

యాలుకల వల్ల చర్మానికి కలిగే ఉపయోగాలు..

యాలకులతో చేసిన స్క్రబ్ చర్మానికి చాలా మేలు చేస్తుంది. ఇది చర్మంలోని మృతకణాలను తొలగించి, చర్మాన్ని లోపలి నుంచి శుభ్రపరుస్తుంది.

ముఖంపై ఏర్పడే మొటిమలను తగ్గించే యాంటీ బ్యాక్టీరియల్ లక్షణాలను కలిగి ఉండటం వల్ల మొటిమలు రాకుండా చూడవచ్చు.

ముఖంపై మచ్చలను పోగొట్టటంలో సైతం దోహదపడతాయి.

చర్మంలోని సెబమ్ ను తగ్గిస్తాయి. ఇందులో ఉండే విటమిన్ ఇ వృద్ధాప్యాన్ని నివారించి చర్మంపై ముడతలను పోగొడతాయి.

ఎలా తయారు చేసుకోవాలి..

ఒక టీ స్పూన్ తేనెలో యాలకుల పొడిని కలపాలి. దాన్ని మీ ముఖంపై అప్లై చేయాలి. దీని వల్ల చర్మం నిగనిగలాడుతుంది. యాలుకల్లో ఒక రకమైన నల్ల యాలకుల వల్ల చర్మ సౌందర్యం పెరుగుతుంది. చర్మం మెరుపును సంతరించుకుంటుంది. ఇలా వారానికి ఒకసారి.. ఈ ప్యాక్ వేసుకుంటే.. స్కిన్ బాగుంటుంది. మీరు ఓ సారి ట్రే చేయండి.!