బ్యూటీ టిప్స్‌లో కలబంద ప్రాముఖ్యతే వేరు. ముఖానికి, జుట్టుకు కలబందను విరివిగా వాడతారు. కలబందతో ఫేస్ వాష్‌లు, షాంపూలు తయారు చేస్తారని తెలుసు.. కానీ మీరు కలబంద ఆయిల్ గురించి విన్నారా..? కలబంద ఆయిల్ జుట్టుకు, చర్మానికి చాలా మేలు చేస్తుంది. జుట్టు కుదుళ్ల నుంచి బలంగా చేయడంలో ఈ ఆయిల్ బాగా ఉపయోగపడుతుందట.. ఇంకా ఏం లాభాలు ఉన్నాయంటే.
చుండ్రు సమస్యను దూరం చేస్తుంది
చుండ్రు సమస్యను తొలగించడానికి కలబంద నూనెను చక్కగా పనిచేస్తుంది. స్కాల్ప్ నుంచి డెడ్ స్కిన్ సెల్స్ తొలగించడంలో కూడా కలబంద నూనె చాలా మేలు చేస్తుంది. దీన్ని సహజమైన హెయిర్ క్లెన్సర్‌గా కూడా వాడొచ్చు.
జుట్టు దృఢంగా
జుట్టును బలంగా, మందంగా, పొడవుగా పెరిగెలా చేయడానికి కలబంద నూనె ఉపయోగించవచ్చు. ఇందులో ఉండే లక్షణాలు జుట్టు పెరుగుదలను వేగవంతం చేయడానికి పని చేస్తాయి. అలోవెరాలో ఉండే ఖనిజాలు, ఎంజైములు జుట్టును బలంగా, పొడవుగా, మందగా చేస్తాయి..
మెరిసే చర్మం.. చేస్తుంది
చర్మం గ్లో లేదా ప్రకాశాన్ని పెంచడానికి కలబంద నూనెను ఉపయోగించవచ్చు. ఇందులో ఉండే విటమిన్లు, ఇతర లక్షణాలు చర్మానికి పోషణను అందిస్తాయి.
పొడి చర్మానికి మేలు చేస్తుంది..
అలోవెరా ఆయిల్ చర్మాన్ని హైడ్రేట్ చేయడానికి, మాయిశ్చరైజ్ చేయడానికి చాలా ఉపయోగకరంగా ఉంటుంది. ఇందులో ఉండే గుణాలు చర్మాన్ని ఆరోగ్యవంతంగా చేస్తుంది.. పొడి చర్మం ఉన్నవారికి కలబంద నూనె వాడకం చాలా మేలు చేస్తుంది.
ఇలా కలబంద నూనె చర్మానికి, జుట్టుకు చక్కగా పనిచేస్తుంది. మార్కెట్‌లో కలబంద నూనె విరివిగా దొరుకుతుంది. అయితే మంచిది ఎంచుకుని తీసుకుంటేనే ఈ లాభాలు అన్నీ పొందవచ్చు. కల్తీ నూనెను వాడటం వల్ల ఎలాంటి లాభం ఉండదు. ఇంట్లో కలబంద మొక్క ఉన్నా.. మీరు ఆ జెల్‌ను వాడుకోవచ్చు. అది ఇంకా ప్యూర్ కాబట్టి..మంచి లాభాలు పొందవచ్చు. కొందరికి కలబంద పడదేమో అని డౌట్ ఉంటుంది. అలాంటి వారు ప్యాచ్ టెస్ట్ అనంతరం వాడుకోవచ్చు. అయితే నిజానికి కలబంద చర్మాన్ని మాయిశ్చర్ చేస్తుంది, గ్లోయింగ్ ఉండేలా చేస్తుంది కానీ చర్మం ఛాయ తగ్గుతుంది..కొందిరికి కలబంద వాడటం వల్ల ముఖం నల్లగా అవుతుంది..అయితే అందరికీ కాదు. మీకు పడుతుందా లేదా టెస్ట్ చేసుకుని వాడితే మాత్రం మీ జుట్టుకు, చర్మానికి ఇక తిరుగే ఉండదు.