హెలికాప్టర్‌లో బయలుదేరిన అమిత్ షా.. కాసేపట్లో మునుగోడుకు

-

బహిరంగ సభలు, పాదయాత్రలో మనుగోడులో రాజకీయ సందడి నెలకొంది. ఇప్పటికే మునుగోడులో టీపీసీసీ చీఫ్‌ రేవంత్‌ రెడ్డి పాదయాత్ర చేయగా.. సీఎం కేసీఆర్‌ టీఆర్‌ఎస్‌ పార్టీ మునుగోడు ప్రజాదీవెన పేరిట భారీ బహిరంగ సభను నిర్వహించారు. ఈ నేపథ్యంలోనే.. మరికొద్దిసేపట్లో మునుగోడులో కేంద్ర హోంమంత్రి అమిత్ షా బహిరంగ సభ ప్రారంభం కానుంది. కాసేపటి క్రితం ఆయన హైదరాబాద్ నుంచి మునుగోడుకు ప్రత్యేక హెలికాప్టర్ లో బయల్దేరారు. అంతకు ముందు ఢిల్లీ నుంచి వచ్చిన అమిత్ షాకు బేగంపేట్ ఎయిర్ పోర్టులో రాష్ట్ర బీజేపీ నేతలు ఘనస్వాగతం పలికారు. అనంతరం సికింద్రాబాద్ లోని ఉజ్జయిని మహంకాళి ఆలయంలో ఆయన ప్రత్యేక పూజలు నిర్వహించారు.

अमित शाह के हेलीकॉप्टर को उतरने की इजाजत के मुद्दे पर झूठ फैला रही BJP:  तृणमूल कांग्रेस | tmc says bjp is spreading lies on issue of Amit Shah's  helicopter landing in

అనంతరం నగరంలోని సాంబమూర్తినగర్ లో బీజేపీ దళిత కార్యకర్త సత్యనారాయణ ఇంటికి వెళ్ళారు అమిత్‌ షా. ఇప్పటికే మునుగోడు సభాప్రాంగణానికి బీజేపీ రాష్ట్ర కీలక నేతలందరూ చేరుకున్నారు. ఈ సభలో బీజేపీ కండువాను కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కప్పుకోనున్నారు. మునుగోడులో సీఆర్పీఎఫ్ అధికారులతో తొలుత అమిత్ షా భేటీ అవుతారు. అనంతరం సభలో ప్రసంగిస్తారు. మరోవైపు నిన్న మునుగోడులో ముఖ్యమంత్రి కేసీఆర్ బహిరంగసభను నిర్వహించిన సంగతి తెలిసిందే. ఈ సభలో కేసీఆర్ మాట్లాడుతూ… కేంద్ర ప్రభుత్వం, ప్రధాని మోదీలపై కేసీఆర్ తీవ్ర విమర్శలు గుప్పించారు. ఈ నేపథ్యంలో ఈరోజు టీఆర్ఎస్ ప్రభుత్వంపై అమిత్ షా ఎలా స్పందిస్తారనే విషయంపై ఆసక్తి నెలకొంది.

Read more RELATED
Recommended to you

Latest news