పంచదార ఆరోగ్యానికి మంచిది కాదు..కానీ అందానికి మాత్రం భలే సెట్ అవుతుంది..!

-

వైట్ పాయిజన్ లో ఒకటైన పంచదార ఆరోగ్యానికి మంచిది కాదని వైద్యులు అంటుంటారు. కానీ..మనం మాత్రం పంచదారతో స్వీట్స్ చేసుకుని తింటాం. ఆరోగ్యానికి మంచిది కాదు కానీ..పంచదార అందానికి మాత్రం బాగా ఉపయోగపడుతుంది. చర్మం మీద ఉండే మృతకణాలను తొలగించడం.. చర్మాన్ని ప్రకాశవంతంగా మెరిపించడం వంటి గుణాలు పంచదారకు ఉన్నాయి. సౌందర్య సంరక్షణకు పంచదారని ఏ విధంగా ఉపయోగించుకోవచ్చో చూద్దాం.

చర్మం మీద పేరుకున్న మృతకణాలను తొలగించడంలో చక్కెర సహజసిద్ధమైన స్క్రబ్‌లా పనిచేస్తుంది. కొద్దిగా తేనె తీసుకుని అందులో చెంచా చక్కెర, బాదంనూనె వేసి బాగా కలపండి…ఈ మిశ్రమాన్ని ముఖానికి, మెడకి అప్త్లెచేసుకుని 10 నిమిషాలు ఆరనిచ్చి తర్వాత మృదువుగా, మర్దన చేసుకోవాలి. ఫలితంగా చర్మంపై పేరుకున్న మృతకణాలు మాత్రమే కాకుండా దుమ్ము, ధూళి వంటివి కూడా తొలగిపోతాయి. అధికంగా ఉండే నూనెల్ని కూడా చక్కెర పీల్చేసుకుని జిడ్డుదనాన్ని తగ్గిస్తుంది.

తేనె, నిమ్మరసం సమపాళ్లలో తీసుకుని అందులో కాస్త చక్కెర వేసి బాగా కలపండి.. ఈ మిశ్రమాన్ని ముఖానికి, మెడకి బాగా పట్టించి కాసేపయ్యాక గుండ్రంగా, మృదువుగా మర్దన చేస్తూ శుభ్రం చేసుకుంటే చర్మం మీద ఉండే మృతకణాలు తొలగిపోవడమే కాకుండా ముఖం ప్రకాశవంతంగా కూడా కనిపిస్తుంది.

చాలామంది మహిళల్లో మోకాళ్లు, మోచేతుల దగ్గర ఉండే చర్మం గరుగ్గా, నల్లగా ఉంటుంది. కొన్ని కొన్ని సందర్భాల్లో వీటి వల్ల ఇబ్బందులు కూడా ఎదురయ్యే అవకాశాలు లేకపోలేవు. ఈ సమస్యకు చెక్ పెట్టడానికి కొన్ని గులాబీ రేకల్ని తీసుకుని ఆరబెట్టి పొడిగా చేసుకోవాలి. గులాబీ రేకుల పొడి మార్కెట్ లో కూడా దొరుకుతుంది. అలా సిద్ధం చేసుకున్న గులాబీ రేకల పొడికి రెండు లేదా మూడు చెంచాల చక్కెర, ఆలివ్‌నూనె జత చేసి బాగా కలపాలి. ఈ మిశ్రమంతో మోచేతులు, మోకాళ్ల దగ్గర నల్లగా ఉన్న ప్రదేశంలో రుద్దితే మంచి ఫలితం ఉంటుంది. ఇలా చేస్తే నలుపుదనం క్రమేపీ తగ్గుతుంది.

చక్కెరెలో రకాలు ఉంటాయి..వాడొచ్చుకదా అని పెద్దపెద్ద పలుకులు ఉండే చెక్కెర వాడొద్దు. అది గీసుకుని స్కిన్ పై గీతలు పడతాయి. చిన్న చిన్న పలుకులతో మృదువుగా ఉన్న చక్కెరని మాత్రమే సౌందర్య సంరక్షణకి ఉపయోగించాలి.

Read more RELATED
Recommended to you

Latest news