‘కొండా’ బయోపిక్ వచ్చేస్తోంది..కీలక అప్ డేట్స్ ఇచ్చిన RGV

-

వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ తెరకెక్కించిన ‘కొండా’ చిత్రానికి సంబంధించిన కీలక అప్ డేట్ వచ్చేసింది. ఈ చిత్ర రెండో ట్రైలర్ ను ఈ నెల 3న విడుదల చేయనున్నట్లు వర్మ తెలిపారు. ట్విట్టర్ వేదికగా ఈ మేరకు ట్వీట్ చేశారు.

ఈ చిత్రాన్ని ఈ నెల 23న విడుదల చేయనున్నట్లు తెలిపారు. వరంగల్ జిల్లాకు చెందిన కాంగ్రెస్ నేత కొండా మురళీధర్ రావు బయోపిక్ ను సినిమా రూపంలో వర్మ తెరకెక్కించారు. 1990లో నక్సలైట్ బ్యాక్ డ్రాప్ లో స్టోరిని కల్పిత గాథగా మార్చి రామ్ గోపాల్ వర్మ ఈ పిక్చర్ ను తెరకెక్కించినట్లు తెలుస్తోంది.

ఈ చిత్రానికి కథ, స్క్రీన్ ప్లే , దర్శకత్వం రామ్ గోపాల్ వర్మ. కాగా, ఇప్పటికే విడుదలైన ట్రైలర్ ఆకట్టుకుంటోంది. గతంలో రాయలసీమ ఫ్యాక్షనిజం బ్యాక్ డ్రాప్ లో సినిమాలు తీసిన..వర్మ.. ఇప్పుడు తెలంగాణ బ్యాక్ డ్రాప్ లో ‘కొండా’ సినిమా తీశారు. వరంగల్ పరిసర ప్రాంతాల్లోనే చిత్ర షూటింగ్ పూర్తి చేసినట్లు సమాచారం.

Read more RELATED
Recommended to you

Latest news